Take a fresh look at your lifestyle.

అఖిల్‌ను అభినందించిన గవర్నర్‌

Telangana Governor congratulates to Akhil

‌హన్మకొండ: లడఖ్‌లోని స్టాక్‌ ‌కాంగ్రీ పర్వతాన్ని అధిరోహించిన వరంగల్‌ అర్బన్‌ ‌జిల్లా హన్మకొండ వాసి రాసమల్ల అఖిల్‌ను గురువారం హైదరాబాద్‌ ‌రాజభవన్‌లో రాష్ట్ర గవర్నర్‌ ‌తమిళ సై సౌందర రాజన్‌ అభినందించారు. చైనా సరిహద్దు లడఖ్‌లోని 6154 మీటర్ల ఎతైన స్టాక్‌ ‌కాంగ్రీ పర్వతాన్ని గత ఏడాది ఆగష్టు 15న అధిరోహించి 365 అడుగుల జాతీయ జెండాను ఎగురవేసి హై రేంజ్‌ ‌బుక్‌ ఆఫ్‌ ‌వరల్డ్ ‌రికార్డును అఖిల్‌ అం‌దుకున్నారు. గతంలో 97 అడుగుల జాతీయ జెండాను ఎగురవేసిన రికార్డును అఖిల్‌ అధిగమించారు. ఇటీవల గవర్నర్‌ ఆదేశాల మేరకు అర్బన్‌ ‌జిల్లా కలెక్టర్‌ ‌ప్రశాంత్‌ ‌జె పాటిల్‌ ‌ప్రోత్సహంతో అఖిల్‌ ‌యూత్‌ ‌రెడ్‌ ‌క్రాస్‌లో సభ్యత్వం తీసుకున్నారు.

ఈ నేపధ్యంలో రాష్ట్రపతి చేతులమీదుగా ప్రారంభించిన తెలంగాణ రెడ్‌ ‌క్రాస్‌ అప్‌ ‌పై నేడు హైదరాబాద్లో, రాజభవన్‌ ‌లో జరిగిన రెడ్‌ ‌క్రాస్‌ ‌సొసైటీ అప్‌ అవగాహనా కార్యక్రమానికి అఖిల్‌ ‌హాజరైయ్యారు. రెడ్‌ ‌క్రాస్‌ ఆధ్వర్యంలో అయన రాష్ట్ర గవర్నర్‌ ‌ను కలిశారు. ఈ సందర్బంగా అఖిల్‌ ‌ధైర్య సాహసాలను గవర్నర్‌ ‌ప్రసంశించారు. రెడ్‌ ‌క్రాస్‌ ‌సేవలు, రక్త దానం పై యువత లో విస్తృత అవగాహన కలిపించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇండియన్‌ ‌రెడ్‌ ‌క్రాస్‌ ‌నేషనల్‌ ‌మేనేజింగ్‌ ‌కమిటీ సభ్యులు డా.పి.విజయచందర్‌ ‌రెడ్డి, స్టేట్‌ ‌మేనేజింగ్‌ ‌కమిటీ సభ్యులు ఈ.వి.శ్రీనివాస్‌ ‌రావు పాలుగోన్నారు.

Tags: hanmakonda, raasamalla akhil, Kangri mountain, 6154 meters high Chinese border, Ladakh, high range book of world record

Leave a Reply