Take a fresh look at your lifestyle.

గవర్నర్‌ ‌కోటా ఎమ్మెల్సీల ప్రమాణం

  • గోరటితో సహా ముగ్గురి చేత ప్రమాణం చేయించిన మండలి ఛైర్మన్‌ ‌గుత్తా

నూతనంగా గవర్నర్‌ ‌కోటాలో నియమితులైన ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్‌లు ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త సభ్యుల చేత శాసనమండలి చైర్మన్‌  ‌బుధవారం ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచాయతీ రాజ్‌ ‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు,మంత్రి సత్యవతి రాథోడ్‌, ‌వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి తదితరులు వారికి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనల మేరకు బంగారు తెలంగాణ సాధనలో అందరం కలిసికట్టుగా పని చేయాలని ఆకాంక్షించారు.

దివంగత నాయిని నర్సింహారెడ్డి, రాములు నాయక్‌, ‌కర్నె ప్రభాకర్‌ ‌పదవీ కాలపరిమితి ముగియడంతో ఈ ఏడాది ఆగస్టు నాటికే శాసనమండలిలో గవర్నర్‌ ‌కోటా స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కర్నె ప్రభాకర్‌, ‌దేశపతి శ్రీనివాస్‌, ‌గోరటి వెంకన్న, దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తె వాణిదేవి, టి.రవీందర్‌రావు తదితరుల పేర్లు వినిపించగా..సీఎం నిర్ణయం మేరకు వీరి పేర్లను ఖరారు చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply