Take a fresh look at your lifestyle.

‌ప్రపంచ ఆరోగ్య దినోత్సవస్ఫూర్తిని విస్మరించిన ప్రభుత్వాలు

కేంద్ర,రాష్ట్రాలపై తులసిరెడ్డి విమర్శలు

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆశించిన ఏప్రిల్‌ 7 ‌ప్రపంచ ఆరోగ్యదినం స్ఫూర్తిని అటు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం.. ఇటు రాష్ట్రంలో జగన్‌ ‌ప్రభుత్వం పాటించడం లేదని పిసిసి వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌తులసిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం వేంప్లలెలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పేరుకు మాత్రమే ప్రపంచ ఆరోగ్య దినంగా చలామణి అవుతున్నట్లు చెప్పారు. స్వచ్చ్ ‌భారత్‌ ‌పథకం మురికి భారత్‌ ‌పథకంగా, స్వచ్ఛంధ్రా పథకం మురికి ఆంధ్ర పథకంగా తయారైనట్లు చెప్పారు. చెత్త నుండి సంపద సృష్టించే కేంద్రాలు దిష్టిబొమ్మలాగా తయారై నిరుపయోగంగా ఉన్నాయని చెప్పారు. హరిత రాయబారులు అడ్రస్‌ ‌లేకుండా పోయారని చెప్పారు. రాష్ట్రంలో ఆరోగ్య శాఖ అనారోగ్యం పాలైందని చెప్పారు. ఆరోగ్య శాఖకు నిధులు లేక రూ.1229 కోట్లు బకాయిలు పేరుకుపోయినట్లు చెప్పారు. ఆరోగ్యశ్రీ, 108, 104 సేవలు సరిగా అందలేదని చెప్పారు. మంత్రులే కరోనా బారిన పడినప్పుడు పోరుగు రాష్టాల్రకు పోయి చికిత్సలు చేయించుకొంటున్నట్లు చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ 2019-2020లో రూ 11399 కోట్లు కేటాయించి రూ.7409 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని చెప్పారు. కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి సేవలు చేసిన 10 వేల మంది కొవిడ్‌ ‌వారియర్స్‌ను (తాత్కాలికంగా నియమించబడ్డా మెడికల్‌ ‌పారా సిబ్బంది) అర్దాంతరంగా తొలగించి వారి భవిష్యత్తును నరకప్రాయం చేసింది జగన్‌ ‌ప్రభుత్వం అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అసమర్థత వల్ల కొవిడ్‌ ‌టీకా అందుబాటులో ఉన్న కూడ టీకా వేసే కార్యక్రమం నత్తనడకన సాగడం శోచనీయమన్నారు.

కొవిడ్‌ ‌టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని చెప్పారు. కొవిడ్‌ ‌వారియర్స్ ‌ను ఉద్యోగ బద్రత కల్పించాలని కోరారు. సంపద కేంద్రాలను అమల్లోకి తేవాలని చెప్పారు. ఆరోగ్యశ్రీ, 108,104 సేవలు వేగవంతం చేయాలని డిమాండ్‌ ‌చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో పేరుకుపోయిన రూ.1229 కోట్లు బకాయిలనచ చెల్లించాలని కోరారు. వైద్య ఆరోగ్య శాఖకు బడ్జెట్‌ ‌కేటాయింపులు పెంచి బడ్జెట్‌ ‌కేటాయించిన మేరకు ఖర్చు చేయాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు.

Leave a Reply