Take a fresh look at your lifestyle.

ఆరోగ్య తెలంగాణ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌ ‌రెడ్డి

Government's goal is to build healthcare Telangana MLA Marri Janardhan Reddy
జాతీయ నులిపురుగుల మాత్రల పంపిణీ : ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌ ‌రెడ్డి

ఆరోగ్య తెలంగాణ నిర్మానమే రాష్ట్ర ప్రభుత్వ లక్షం అని నాగర్‌ ‌కర్నూల్‌ ఎంఎల్‌ఏ ‌మర్రి జనార్దన్‌ ‌రెడ్డి, జడ్పీ చైర్మన్‌ ‌పద్మావతి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ‌బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన జాతీయ నులిపురుగుల నిర్ములాన దినోత్సవం కార్యక్రమంలో ఎంఎల్‌ఏ,‌జడ్పీ చైర్మన్‌ ‌లు పాల్గొని పాఠశాల విద్యార్థినీలకు వ్యాక్సిన్‌ ‌వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌ ‌రెడ్డి ,జడ్పీ చైర్మన్‌ ‌పద్మావతి లు మాట్లాడుతూ చిన్నారులు అనారోగ్యానికి గురికాకుండా, ఆరోగ్యవంతమైన జీవితాన్ని అందించాలనేదే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం అని అన్నారు.బాల్యంలో అనారోగ్యానికి గురైతే భవిష్యత్తులో ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుందని అన్నారు.

అందుకే ఆరోగ్యవంతమైన సమాజాన్ని తయారు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, వ్కెద్య, ఆరోగ్య శాఖ కృషిచేస్తోందని అన్నారు,గోళ్లలోఎప్పటికప్పుడేకత్తిరించుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మరియు బహిరంగ మల విసర్జన మానేయాలి అని అన్నారు.పరిశుభ్రమైన నీటినే తాగాలని పండ్లు, కూరగాయాలు తినే ముందు వాటిని నీటితో శుభ్రంచేసుకోవాలని ,భోజనం చేసే ముందు మరియు మల విసర్జన చేసిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. ఆహార పదార్థాలపై ఎల్లప్పుడూ మూతలను కప్పి ఉంచాలని,నీటిని కాచి చల్లార్చిన తర్వాతనే తాగాలనివి•్య ర్థులకుసూ చించారు. ఈకార్యక్ర మంలోపాఠశాలప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు, ఆశాకార్యకర్తలు తదితరులుపాల్గొన్నారు.

Leave a Reply