కాంగ్రెస్ ఎన్ని సలహాలు ఇచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.అన్నీ మాకే తెలుసు అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.గురువారం రోజు ఏఐసిసి ఆదేశాలమేరకు స్పీకప్ ఇండియా రోజు కార్యక్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.గాంధీభవన్ లో ఒడిషా వలస కార్మికుల తో లాక్ డౌన్ కారణంగా వలస కార్మికులకు ఉత్పన్నమైన సమస్యలను ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయం తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ లో పనిచేస్తున్న ఒరిస్సాకు చెందిన కార్మికుల కోసం బస్సు ఏర్పాటు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది ..
అనంతరం ఆయన మీడియా తో మాట్లాడుతూ…ఏఐసీసీ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు స్పీక్ అప్ ఇండియా పేరిట ఆన్ లైన్ ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారని తెలిపారు . కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న వ్యాపారులకు నేరుగా సహాయం చేయాలని వలస కార్మికుల పట్ల ప్రభుత్వాలు సిగ్గులేకుండా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.వలస కార్మికులకు ఆహారం, భద్రత కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని ఆరోపించారు.ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ,ఉపాధి కూలీలకు 200 రోజుల పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు.తెలంగాణలో కరోనా టెస్టులు తక్కువ సంఖ్యలో చేస్తున్నారని , టెస్టుల్లో ప్రమాదకర వైఖరి అవలంభిస్తున్నరని ధ్వజమెత్తారు. కేవలం 23వేల మందికి మాత్రమే టెస్టులు జరిగాయని అన్నారు. ధాన్యం కొనుగోలులోనూ ప్రభుత్వం విఫలం అయిందని ,మొక్కజొన్న విత్తనాలు అమ్మొద్దని కొన్ని జిల్లాల్లో ఒత్తిడి చేస్తున్నారని ,ఇది రైతుల స్వేచ్ఛను హరించడమే అవుతుందన్నారు.