Take a fresh look at your lifestyle.

‌వలసలపై కళ్ళు తెరిచిన ప్రభుత్వం

జాతీయ ఉపాధి హామీ (నరేగా) యూపీఏ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం. ఐక్యరాజ్య సమితి సహా పలు అంతర్జాతీయ సంస్థలు ఈ పథకాన్ని ప్రశంసించడమే కాకుండా, అట్టడుగువర్గాలు, అసంఘటిత రంగాలకు చెందిన వారికి ప్రయోజనం చేకూర్చడం కోసం ఈ పథకాన్ని అమలు జేయాలని సమితి ఇతర దేశాలకు సూచించింది. ఆ పథకం పటిష్ఠంగా అమలు జరిగి ఉంటే కరోనా నేపధ్యంలో లాక్‌ ‌డౌన్‌ ‌సమయంలో వలస కార్మికుల సమస్య తీవ్ర రూపం దాల్చి ఉండేది కాదు,జాతీయ గ్రామీణ హామీ పథకాన్ని నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత నీరు గార్చారు. గ్రామాల రూపురేఖలను మార్చే ఆ పథకాన్ని రాజకీయ కోణంలో చూడటం వల్లే దానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. వలస కార్మికుల పుణ్యమా అని ఆ పథకం ప్రాథాన్యాన్ని కేంద్రం గ్రహించింది. గ్రామాల్లో ఉపాధి దొరకకపోవడం వల్లనే వ్యవ సాయ కూలీలు, ఇతర అసంఘటిత రంగ కార్మికులు నగరాలు, పట్టణాలకుల పొట్ట చేత్తో పట్టుకుని తరలి వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు లాక్‌ ‌డౌన్‌ 3.0 ‌ముగింపు సమయంలో కేంద్రం ప్రకటించిన ఆత్మనిర్భర భారత్‌ అభియాన్‌ ‌మొత్తం విలువ 20.9 లక్షల కోట్లు అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌తాజాగా ప్రకటించారు. ఈ ప్యాకేజీలో నరేగాకు మరో 40 వేల కోట్ల రూపాయిలు కేటాయించారు. దీనికి కాంగ్రెస్‌ ‌నాయకుడు రాహుల్‌ ‌గాంధీ ప్రధానమ త్రికి ట్విట్టర్‌ ‌లో అభినందనలు తెలిపారు. తొమ్మిదేళ్ళ క్రితం నరేగాను అభినందిస్తూ ఐక్యరాజ్య సమితి గ్లోబల్‌ అసెస్‌ ‌మెంట్‌ ‌రిపోర్ట్ (‌జీఏఆర్‌)‌లో అభినందించింది. ఈ పథకం అమలులో లోపాలు, అవినీతి వల్ల దీనిపై అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న మోడీ ఇది అవినీతి పరుల కల్పతరువుగా అప్పట్లో అభినందించారు. యూపీఏ హయాంలో అన్ని రంగాల్లో అవినీతి మేటలు వేసిన మాట నిజమే . అప్పట్లో చోటు చేసుకున్న అవినీతి ప్రవాహంలో మంచి పథకాలు కొట్టుకుని పోయాయి. వాటిల్లో నరేగా ప్రధానమైనది. నరేగాని సమర్ధవంతంగా కేంద్రీకరించిన పథకంగా యూఎన్‌ఓ ‌పేర్కొంది. అసలు ఈ పథకానికి పునాది మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో పడింది.

అప్పట్లో వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించేందుకు పనికి ఆహార పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత వాజ్‌ ‌పేయి ఆ పథకానికి మెరుగులు దిద్దారు. పనికి ఆహార పథకం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌లో అస్మదీయులకు టన్నుల కొద్దీ బియ్యం కేటాయించేందుకు ఉపయోగ పడిందన్న ఆరోపణలు వచ్చాయి. అలాగే, బీహార్‌ ‌లోనూ, ఉత్తరాది రాష్ట్రాల్లోనూ ఇది దుర్వినియోగం అయింది. దాంతో యూపీయే ప్రభుత్వం దీని పేరును జాతీయగ్రామీణ ఆహార పథకంగా మార్చి అమలు జేశారు. యూపీఏ చైర్‌ ‌పర్సన్‌ ‌సోనియాగాందీ పట్టుదల వల్ల అమలు జరిగిన పథకాల్లో నరేగా, జాతీయ ఆహార భద్రతా పథకాలు ముఖ్యమైనవి. ఈ రెండింటిని అవినీతి కి ఆలవాలమన్న మోడీ ఇప్పుడు మళ్ళీ దుమ్ముదులిపి అమలులో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. నరేగా ద్వారా 300 కోట్ల పనిదినాలు కల్పించడానికి అదనంగా 40 వేల కోట్ల రూపాయిలు కేటాయించాలని నిర్ణయించినట్టు నిర్మలా సీతారామన్‌ ‌తెలిపారు. వలస కార్మికుల సమస్య తీవ్రతను కేంద్రం ఇప్పటికైనా గుర్తించినందుకు ఆనందించాల్సిందే. స్వస్థలాలకు తరలి వెళ్ళే క్రమంలో అలసట చెందిన వలస కార్మికులు రైలు పట్టాలపై నిద్రపోవడం, వారి పై నుంచి రైళ్ళు పరుగులు తీయడంతో ఆ కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోవడం వంటి దురదృష్టకర సంఘటనల తర్వాత కేంద్రం కళ్లు తెరిచింది. ఇంత జరిగినా వలస కార్మికుల సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు., ఆఖరుకు సుప్రీంకోర్టు కూడా వలస కార్మికుల కదలకలపై నిషేధం విధించలేమంటూ ప్రకటించడం కేంద్రానికి ఓ హెచ్చరిక వంటిదే.

నరేగా నిధులు అదనంగా 40 వేల కోట్లు పెంచినందుకు సంతోష పడాల్సిందేమీ లేదు. దివాళా పరిమితిని లక్ష నుంచి కోటికి పెంచడం, సంపన్న వర్గాలకు మేలు చేకూర్చే ఇతర అంశాలతో పోలిస్తే గ్రామీణ ఉపాధికి కేటాయింపులు ఇంకా తక్కువే. జాతీయ స్థాయిలో వన్‌ ‌నేషన్‌, ‌వన్‌ ‌రేషన్‌ ‌పథకం వల్ల వలస కార్మికులకు నిజంగా మేలు జరుగుతుంది. అది అమలు జరిగితే అసంఘటిత రంగ కార్మికులు దేశంలో ఎక్కడికైనా వెళ్ళి పనులు చేసుకోవచ్చు. ఆయా రాష్ట్రాల్లో రేషన్‌ ‌పొందవచ్చు. శ్రామిక రంగానికి తోడ్పడే ఇలాంటి చర్యలను తీసుకోవాలని ప్రతి పక్షాలు కోరుతున్నాయి. నిర్మలా సీతారామన్‌ ‌కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాని చేతులెత్తి కోరుతున్నానంటూ వలస కార్మికుల విషయంలో కలిసి పని చేద్దామంటూ విజ్ఞప్తి చేశారు. మంచి చేస్తే ఎవరు అభినం దించరు. నరేగా నిధులు మరో 40 వేల కోట్లు కేటాయించినందుకు రాహుల్‌ ‌గాంధీ ప్రధానికి ట్విట్టర్‌ ‌లో అభినందనలు తెలపడాన్ని ఈ కోణం నుంచే పరిశీలించాలి.

Leave a Reply