Take a fresh look at your lifestyle.

ప్రజల అవసరాలు తీర్చడమే ..ప్రభుత్వ లక్ష్యం

trs working president, ktr, meeting
తెరాస వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మంత్రి కేటీఆర్‌

ప్రజల అవసరాలు తీర్చడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం పనిచేస్తోందని, ఆమేరకు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తుందని తెరాస వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. శుక్రవారం తెలంగాణభవన్‌లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం కేటీఆర్‌ ‌మాట్లాడుతూ.. అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందుతున్నాయని అన్నారు.

కొత్తగా పంచాయతీరాజ్‌, ‌మున్సిపల్‌ ‌చట్టాలను తీసుకొచ్చామని, తెలంగాణ ఏర్పడ్డాక ఏ ఎన్నిక వచ్చినా ప్రజలు టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టారన్నారు. హుజూర్‌నగర్‌ ఉపఎన్నికలో బ్రహ్మాండమైన విజయం సాధించామని, విపక్షాల పరిస్థితి ఆడలేక మ్దదెల ఓడినట్లుగా ఉందన్నారు. ప్రజల్లోకి వెళ్లాలంటేనే కాంగ్రెస్‌ ‌భయపడుతోందని, తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్‌ ‌నాయకత్వాన్ని కోరుకుంటున్నారని కేటీఆర్‌ అన్నారు. మేము నేల విడిచి సాము చేయడం లేదని, ప్రజలు సంపూర్ణమైన మెజార్టీ మాకు కట్టబెట్టారని అన్నారు. 2014లో 63సీట్లు గెలిచిన టీఆర్‌ఎస్‌, 2018‌లో 88సీట్లలో గెలిచిందని అన్నారు.

తిరుగులేని రాజకీయ శక్తిగా టీఆర్‌ఎస్‌ అవతరించిందని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో మున్సిపల్‌ ఎన్నికల్లో విజయం సాధిస్తామన్నారు. ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ ‌పార్టీ సిద్ధంగా ఉందని, ప్లలె ప్రగతి తరహాలోనే పట్టణ ప్రగతి కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు. ప్లలెలు, పట్టణాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని కేటీఆర్‌ ‌తెలిపారు. కొత్త పంచాయతీరాజ్‌ ‌చట్టం వచ్చిన తర్వాత గ్రామాల్లో అద్భుతమైన మార్పులు వస్తున్నాయని కేటీఆర్‌ అన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా మున్సిపాలిటీలకు నిధులిచ్చామని తెలిపారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలే ఎజెండాగా ముందుకు పోతామని కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. ఆరు లక్షల మందికి కేసీఆర్‌ ‌కిట్‌ అం‌దించామని, 40లక్షల మందికి ఆసరా పెన్షన్లు అందిస్తున్నామని అన్నారు. ప్రజలకు, పార్టీకి మధ్య వారధిగా 60లక్షల మంది గులాబీ సైనికులున్నారని, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు. 95శాతం పార్టీ కమిటీల ఏర్పాటు పూర్తయిందని మంత్రి కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. ప్రజాదరణ కలిగిన, పార్టీ కోసం కష్టపడిన వారికి టికెట్లు ఇస్తామని అన్నారు. వారికి అన్ని విధాల సహకరించి ప్రతీ కార్యకర్త వారి గెలుపుకోసం కృషి చేయాలని కేటీఆర్‌ ‌పిలుపునిచ్చారు.

Tags: trs working president, ktr, meeting, public needs, panchayat raj, municipal

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy