Take a fresh look at your lifestyle.

ప్రజలను ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకోవాలె …

సీఎం కేసీఆర్ కి ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ….
సీఎం కేసీఆర్ కి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు..ఈ లేఖ లో ఐదు డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచారు.బుధవారం గాంధీభవన్ లో జగ్గారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు..ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ….ప్రస్తుతం హౌస్  టాక్స్ కట్టే పరిస్థితి లేదు కాబట్టి  ఏడాది టాక్స్ మాఫీ చేయాలని,కిరాయి దారులు రెంట్ కట్టే పరిస్ధితిలో లేరు కనుక  ఆరు నెలలు పాటు కిరాయిలు ప్రభుత్వమే చెల్లించాలని, నల్లా బిల్లులు కూడా ఏడాదిపాటు రద్దు చేయాలని, పరిశ్రమలకు కూడా రాయితీ ఇవ్వాలని ,ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం దేనని డిమాండ్  చేశారు.ఈ ఐదు డిమాండ్ల తో  సీఎం ఆఫీస్ కి లేఖ పంపించారు..ఈ నెల 8 లోపు ప్రభుత్వం నుండి స్పందన రాకుంటే,ఈ నెల 9వ తేదీన ఒక్క రోజు దీక్ష చేస్తానని ప్రకటించారు.ప్రభుత్వం దగ్గర డబ్బులు లెకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు కోసం  25వేల కోట్లు టెండర్ కు ఎలా అనుమతి ఇచ్చిందని ప్రశ్నించారు.కేంద్రం కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదుకోవాలని  అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంపీ  లతో కేంద్రం మీద ఒత్తిడి పెంచాలని సూచించారు.సీఎం కేసీఆర్ ప్రధానిని నిపదీయడానికి వెనుకంజ వేస్తున్నారని, బీజేపీ తో కేసీఆర్ కు రహస్య ఒప్పందం ఉందని, అందుకే కేసీఆర్ మోడీ ని ప్రశ్నించడం లేదని ఆరోపించారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!