Take a fresh look at your lifestyle.

భూ విక్రయాలకు సిద్ధమైన ప్రభుత్వం..

రాష్ట్రంలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను విక్రయించేందుకు కెసిఆర్‌ ‌ప్రభుత్వం సిద్ధమయింది .. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు కూడా ప్రభుత్వం జారీ చేసింది. ఆ మేరకు రాష్ట్ర యంత్రాంగం ప్రభుత్వ భూములను గుర్తించే పనిలో పడింది. ఈ- వేలం ద్వారా నిర్వహించే ఈ కార్యక్రమానికి ఈ నెల పదిహేనవ తేదీన నోటిఫికేషన్‌ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది కూడా. బిడ్‌ ‌రిజర్వేషన్లకు జూలై 13వ తేదీ చివరి రోజుగా పేర్కొనగా, 15వ తేదీన వేలం ఉంటుందని తెలిపింది. రాష్ట్ర రాజధాని మొదలు వివిధ జిల్లాల్లో ప్రభుత్వ భూమిని గుర్తించడ మొదలు దాని విక్రయాలను చూసేందుకు ప్రభుత్వం మూడు కమిటీలను వేసింది. ప్రతీ జిల్లాలో కనీసం వెయ్యి ఎకరాలను ల్యాండ్‌ ‌బ్యాంకుగా గుర్తించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలుకూడా జారీచేశారు. అంటే రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల్లో వెయ్యి ఎకరాల చొప్పున 33వేల ఎకరాలను ప్రభుత్వం అమ్మి సొమ్ము చేసుకోవడానికి సిద్ధమైందని స్పష్టమవుతోంది. నిరుపయోగంగా ఉన్న భూములను విక్రయిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా ఈ భూముల విక్రయాలను ఎట్టి పరిస్థితిలో అడ్డుకుంటామని కాంగ్రెస్‌, ‌బిజెపి పార్టీలంటున్నాయి. భవిష్యత్‌లో ప్రభుత్వ పరంగా భారీ నిర్మాణాలకు ఉపయోగపడే ఈ భూములను కాపాడుకోవాల్సిన అవసరం ఎంత్తైనా ఉందంటున్నాయి ఆ పార్టీలు.

గత ప్రభుత్వాలు ప్రభుత్వ భూమి అని, అసైన్డ్ ‌భూమి, శిఖం, అటవీ, దేవాదాయ, వక్ఫ్ ‌భూదాన, భూసంస్కరణల మిగులు భూములంటూ క్యాటగరీలు చేసి వాటిని కాపాడుతూ, అవసరాలను బట్టి వినియోగించుకుంటూ వొచ్చాయంటున్నాయి. ఆలాంటి భూములను భావితరాలకోసం జాగ్రత్త చేయాల్సి ఉండగా తెగనమ్మి సొమ్ముచేసుకోవాలనుకోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమంటున్నాయా పార్టీలు. ప్రభుత్వ భూమి అన్నది ప్రజల ఆస్థి. ప్రభుత్వ ఆధీనంలో ఉన్నంత మాత్రాన వాటిని ఆదాయ వనరుగా చూడడం సమంజసం కాదు. కేవలం ప్రజల అవసరాలకే వినియోగించాలె. రానున్న కాలంలో ఏర్పాటు చేసే విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థలు, శాస్త్ర సామాజిక పరిశోధనా అవసరాలకు, స్టేడియంల నిర్మాణానికి, హాస్పిటల్స్, ‌బస్‌ ‌స్టేషన్‌ల ఏర్పాటుకు వాటిఅవసరం ఎంతో ఉంటుంది. అంతెందుకు రాష్ట్ర ప్రభుత్వం పేదలకు కట్టి ఇస్తామన్న డబుల్‌ ‌బెడ్‌ ‌రూంల ఇళ్ల నిర్మాణానికి భూసేకరణలో ఆలస్యం జరుగుతున్న విషయం తెలియందికాదు. ఇలాంటి అవసరాలకు వినియోగించాల్సిన భూమిని ప్రభుత్వం ఆదాయ వనరుగా చూడడాన్ని భారతీయ జనతాపార్టీ తీవ్రంగా ఖండిస్తోంది.

వందల, వేల ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతుంటే వాటిని కాపాడుకోలేకపోతున్న ఈ ప్రభుత్వం, అక్రమణదారులకు అయినకాడికి ఎంతో కొంతకు ముట్టజెప్పాలని చూస్తున్నదంటూ ఆ పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. తెలంగాణ ఏర్పడకముందు ఇక్కడి ప్రభుత్వ భూములు చాలా వరకు మాయమైనాయి. తెలంగాణ ఏర్పడిందే మా భూములు మాకే.. అన్న నినాదంతో. తెలంగాణ ఏర్పడిన తర్వాతకూడా ఇక్కడి భూములకు రెక్కలొస్తే ఇక కాపాడే వారెవరంటున్నారు బిజెపి నేత ఎన్‌విఎస్‌ఎస్‌ ‌ప్రభాకర్‌. ‌రాష్ట్రంలోని ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూ విక్రయాలపై ప్రభుత్వం ఏకపక్షంగా పోకుండా అభిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్‌ ‌చేస్తున్నాడు. కాగా గత ప్రభుత్వాలు ఇలానే అమ్మకాలు చేపట్టినప్పుడు టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ఆందోళన చేపట్టిన విషయాన్ని మరిచిపోయిందా అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌ ‌ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ వారే ప్రభుత్వ, అసైన్డ్ ‌భూములను ఖబ్జా పెడుతుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటున్నదని, ముందు వారినుండి ఆ భూములను సేకరించాలని ఆయన డిమాండ్‌ ‌చేస్తున్నారు.

ప్రభుత్వం ఇలానే మొండికేస్తే దీనిపై ప్రజా ఉద్యమం, రాజకీయ ఆందోళన, న్యాయపోరాటం చేస్తామని సంజయ్‌ ‌హెచ్చరిస్తున్నారు. కాగా ప్రభుత్వం ఆదాయం సమకూర్చుకోవడానికి ఇతర మార్గాలను అన్వేషించకుండా ఈ భూములను ఎవరికోసం విక్రయిస్తున్నదని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి తరుణ్‌ఛాన్‌ ‌టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో అక్రమంగా గెలిచేందుకు కోట్ల రూపాయలు గుమ్మరించడానికా అని ప్రశ్నిస్తున్న ఆయన ప్రభుత్వ ఈ విధానాన్ని ఎక్కడికక్కడ అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్‌ ‌కూడా ఈవిషయంలో అధికారపార్టీని తీవ్రంగా విమర్శిస్తోంది. తమ ఆర్థిక పాపాలను కడుక్కోవడానికే ఈ భూముల అమ్మకాలా అని సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నిస్తున్నారు. స్వాతంత్య్రం వొచ్చినప్పటినుండి ప్రభుత్వ భూములను కాంగ్రెస్‌ ‌కాపాడుకుంటూ వొస్తున్నదని, ప్రజా అవసరాలకు ఉపయోగపడాల్సిన భూములను ఆదాయంకోసం అమ్ముకోవడం సరైందికాదంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 15వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో ఉందని, ఇప్పుడు వేల కోట్ల అప్పుల తెలంగాణగా మారిందంటూ ఆరోపిస్తున్న భట్టి, అటు భూములమ్మి, ఇటు వేల కోట్ల అప్పులు తెచ్చి చివరకు తెలంగాణ ప్రజలను ఈ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందో అర్థం కావడంలేదని, ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు మేల్కొని ప్రజల భూములను ప్రభుత్వం అమ్మకుండా అడ్డుకోవాలని పిలుపిస్తున్నాడు. ఇదిలా ఉంటే మొదటి విడుతగా హైదరాబాద్‌ ‌చుట్టు పక్కల ఉన్న కోకాపేట, పుప్పాలగూడ, షేర్‌లింగంపల్లి, కోహెడ భూముల విక్రయానికి ప్రభుత్వం రంగం స్ది•ంచేస్తోంది.

Leave a Reply