Take a fresh look at your lifestyle.

వరదల విషయంలో నిద్ర నటిస్తున్న ప్రభుత్వం

ప్రజలు అవస్థలు పడుతున్నా పట్టించుకోవడం లేదు : కోదండరామ్‌
నగరంలో వరద విషయంలో ప్రభుత్వం నిద్ర నిటిస్తుందని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ ఆరోపించారు. సోమవారం ఆయన మిడియాతో మాట్లాడుతూ నగరంలో వరద నివారణకు జేఎన్‌టీయూ, ఐఐటీల సహాయం తీసుకోవాలన్నారు. వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. చెరువుల ఆక్రమణలను ప్రభుత్వం అడ్డుకోవాలన్నారు. ప్రభుత్వాలు చేసిన తప్పిదాల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని కోదండరామ్‌ అన్నారు.

గతేడాది వచ్చిన వరదల్లో నష్టపోయిన వారికి ఇప్పటికీ పరిహారం అందలేదన్నారు. తాజాగా ఒకటి రెండు వర్షాలకే ఇళ్లల్లోకి నీరు చేరిందన్నారు. ప్రజలు అవస్థలు పడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు.

Leave a Reply