భద్రాచలం అభివృద్ధి పట్ల ముఖ్యమంత్రి టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని, ముఖ్యమంత్రి ప్రకటించిన 100 కోట్లు నిధులు జాడ లేవని మిత్రులకు సన్మానాలు తప్ప సమస్యలు పట్టవని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, మాజీ ఎమ్మెల్యే కుజా బుజ్జి విమర్శించారు. భద్రాచలం పట్టణ సమస్యలు పరిష్కరించాలని సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో భారీ ప్రజా ప్రదర్శన సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం సోమవారం నాడు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి అధ్యక్షతన జరిగిన సభలో వారు మాట్లాడుతూ ఈ రోజు ప్రజల సమస్యలు, ముఖ్యమంత్రి ప్రకటించిన వాగ్దానాలు అమలు చేయమంటున్నారు అని అన్నారు.
భద్రాచలం పట్ల ముఖ్యమంత్రి పక్షపాతం చూపుతున్న రాని అన్నారు. భద్రాద్రి రాముడి పట్ల ఎందుకు వివక్షత చూపుతున్నారని అని ప్రశ్నించారు. 100 కోట్లు ప్రకటించి ముఖ్యమంత్రి వంద రూపాయలు కూడా ఇవ్వలేదని అన్నారు. మంత్రులు భద్రాద్రి అభివృద్ధికి ఏమీ లేదని అన్నారు. భద్రాచలం పట్టణంలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్ల మంజూరు చేయాలన్నారు. అలాగే డబల్ బెడ్రూమ్ ఇల్లు ప్రతి పేదవానికి ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఇచ్చింది నామమాత్రమేనని అన్నారు. సొంత స్థలం ఉన్న వారికి వారి స్థలంలోనే డబల్ బెడ్ రూమ్ కట్టిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, దాన్ని ఇప్పటివరకు అమలు చేయలేదని ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారని అన్నారు. ప్రభుత్వం అర్హులైన వారందరికీ పింఛన్లు, రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భద్రాచలం ఎన్నికలు జరపాలని పంచా యతీయా, మున్సిపాలిటీ తేల్చాలని అన్నారు. భద్రాచలం పట్టణ అభివృద్ధి పట్ల ప్రభుత్వం చూపుతున్న ,వివక్షతను నిరసిస్తూ భద్రాచలం పట్టణంలో గత 15 రోజులుగా సిపిఎం సర్వే నిర్వహించి సమస్యలు తెలుసుకున్న దని చెప్పారు. సమస్యలు పరిష్కరించకుంటే రాబోయే కాలంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నా అనంతరం ఏఓ రామకృష్ణకు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్,జిల్లాకమిటీ సభ్యులు నర్సారెడ్డి,పట్టణనాయకులు బి వెంకటరెడ్డి, పాల్గొన్నారు.
Tags: Government, negligence, development, Bhadradri