Take a fresh look at your lifestyle.

కళాకారులకు ప్రభుత్వం పెద్దపీట

Government is the big buzzword for artists
కార్యక్రమంలో మాట్లాడుతున్న జిల్లా పరిషత్‌ ‌చైర్మన్‌ ‌లింగాల కమల్‌రాజ్‌

దైవదత్తమైన కళను నమ్ముకుని జీవిస్తున్న కళాకా రులకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని జిల్లాపరి షత్‌ ‌చైర్మన్‌ ‌లింగాల కమల్‌రాజ్‌ అన్నారు. శుక్రవారం ఖమ్మం సీక్వెల్‌ ‌రిసార్టస్‌లో మువ్వా పద్మావతి-రంగయ్య ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రెందురోజుల పాటు నిర్వహించనున్న యువ కళో త్సవ్‌-2020‌ను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్బంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఖమ్మం జిల్లా కళాకారులకు గుమ్మం అని, ఎంతోమంది ప్రతిభ గల కళాకా రులు ఖమ్మం గడ్డపై పుట్టి, జాతీ య అంతర్జాతీయ స్తాయిలో పేరుతెచ్చుకున్నారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం పేద కళాకారులకు చేయూతనిస్తుందని చెప్పారు. ప్రతిభగల కళాకా రులకు ఉద్యోగాలిచ్చిన ఘనత కూడా తెలంగాణ సర్కారుదేన న్నారు. తెలంగాణ ఉద్యమంలో కళాకారుల పాత్ర కీలకమని అలాంటి కళాకారులు ఉన్న ఖమ్మం జిల్లా కళారంగ ప్రతిష్ట పెంచేవిధంగా యువకళోత్సవ్‌-2020 ‌నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు.

చిన్నారులు సైతం అద్బుత ప్రతిభా పాట వాలు ఉన్నవారేనని తరచూ కార్యక్రమాల నిర్వహణ ద్వారా ఖమ్మం జిల్లా కళారంగంలో ఇతర ప్రాంతా లకంటే మణిమకుటంగా నిలవాలన్నారు. నిర్వాహకులు ప్రసాద్‌ ‌ప్రతిభ గల డాన్స్ ‌మాస్టర్‌ అని ఆయన ఆద్వర్యం లో నగరంలోని వివిధ పాఠశాలల, కళాశాలల విద్యా ర్దులకు పలు అంశాల్లో రెండురోజుల పాటు పోటీ లు నిర్వహించి వారిలోని సృజనాత్మకతను వెలికితీసే ప్రయ త్నం చేయడం అభినందనీయమన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు ఖమ్మం ప్రజలు,విద్యావేత్తలు, విద్యా సంస్తల ప్రముఖులు కూడా ప్రోత్సాహమివ్వటం అభినం దనీయమన్నారు. డాన్స్‌మాస్టర్‌ ‌ప్రసాద్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళా సిఐ అంజలి, జిల్లా మహిళా ప్రాంగణం అధికారిణి వేల్పుల విజేత, వివిద ప్రవేటు విద్యాసంస్థల యాజమాన్య కమిటిల వారు, కళాకారులు,తదితరులు పాల్గొన్నారు. అనంతరం విచిత్ర వేషధారణ, వ్యాసరచన,  నృత్యపోటీలు నిర్వహించారు.
Tags: Kamalraj, chairman district, prasad, big buzzword for artists

Leave a Reply