- రహదారుల అభివృద్ధి కోసం కృషి
- మొక్కలనుపెంచడం వాతావరణం కాపాడుదాం
- రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు
మెదక్ మే 1 ( ప్రజాతంత్ర ప్రతినిధి ) : సాగునీటి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు శుక్రవారం కొల్చారం మండలం లో విస్తృతంగా పర్యటించారు రంగంపేట గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు మెదక్ జోగిపేట రహదారి పనులను పరిశీలించి ప్రారంభించారు మంజీరా నది లో చెక్ డ్యామ్ ను పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం వారి పడుతుందని వివరించారు వరి ధాన్యం కొనుగోలులో ఎలాంటి అవినీతి అక్రమాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించారు
ప్రభుత్వం రైతులకు వెంటనే డబ్బును అందజేస్తున్నట్లు తెలిపారు సాగునీరు రైతులకు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉందని తెలిపారు మెదక్ జోగిపేట రహదారి గత పాలకుల నిర్లక్ష్యం తో పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఉమ్మడి మెదక్ జిల్లాలో రహదారులను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు వాతావరణం కాలుష్యం కాకుండా మొక్కలు నాటి కాపాడుకోవాలని తెలిపారు ప్రభుత్వం పచ్చదనం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసిందని వివరించారు నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎం యల్ ఎ చిలుముల మదన్ రెడ్డి కలెక్టర్ ధర్మ రెడ్డి జేసీ నగేష్ జెడ్పిటిసి మేఘమాల సంతోష్ డీసీఎంఎస్ వైస్ ఛైర్మెన్ ఆరిగే రమేష్ పాల్గొన్నారు