Take a fresh look at your lifestyle.

నూనె గింజల ఉత్పత్తిని పెంచడానికి రైతులకు ప్రభుత్వ ప్రోత్సహం

  • ఎస్సీ, ఎస్టీ, సన్న, చిన్న కారు రైతులకు ఉచితంగా కంది విత్తనాలు
  • రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు

ప్రభుత్వం నూనె గింజల ఉత్పత్తిని పెంచడానికి రైతులను ప్రోత్సహిస్తున్నదని, జిల్లాలో ఉచితంగా కంది విత్తనాలను ఎస్సీ, ఎస్టీ, సన్న చిన్న కారు రైతులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మాత్యులు హరీష్‌ ‌రావు తెలిపారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్‌ ‌సమావేశ మందిరంలో ఎస్సీ, ఎస్టీ, సన్న, చిన్న కారు రైతులకు ఉచిత కంది విత్తనాల పాకెట్లను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లాకు 51 లక్షల విలువగల 554 క్వింటాళ్ల ఉచిత కంది విత్తనాలను కేటాయించినట్లు తెలిపారు. ప్రభుత్వం పొద్దుతిరుగుడు, పల్లీ, ఇతర నూనె గింజల ఉత్పత్తిని ఎక్కువగా ప్రోత్సహించడానికి నిర్ణయించిందన్నారు. ఈ వానా కాలం రాష్ట్రంలో 70 లక్షల ఎకరాల్లో పత్తి, 20 లక్షల ఎకరాల్లో కంది, ఎనిమిది లక్షల ఎకరాల్లో పామాయిల్‌ ‌సాగు చేయడానికి ముఖ్యమంత్రి నిర్ణయించారనీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కూడా పప్పు దినుసులకు మద్దతు ధర మరింత పెంచిందని తెలిపారు.

జిల్లాలో కంది సాగు బాగుందని, సబ్సిడీపై అందరి రైతులకు నాణ్యమైన కంది విత్తనాలు అందుబాటులో ఉంచామన్నారు. ఈ సంవత్సరం జిల్లాలో కంది, పత్తి సాగును ప్రోత్సహించాలని అధికారులను కోరారు. ఉచితంగా అందిస్తున్న కంది విత్తనాలను ఎస్సీ, ఎస్టీ, సన్న, చిన్నకారు, రైతులకు అందించాలని మంత్రి సూచించారు. ఇంటర్నేషనల్‌ ‌మార్కెట్లో రాష్ట్ర పత్తికి ఎక్కువగా డిమాండ్‌ ఉం‌దన్నారు. ప్రభుత్వం పత్తిని ఎంఎస్‌పి ధర కంటే ఎక్కువ ధరకు అమ్మడానికి రైతులకు వెసులుబాటు కల్పించిందన్నారు. అంతకుముందు పాశం మైలారం కిర్బి పరిశ్రమ యాజమాన్యం, అజీమ్‌ ‌ప్రేమ్‌ ‌జీ పౌండేషన్‌ ‌వారు జిల్లాకు విరాళంగా ఇచ్చిన మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌కు సంబంధించిన వాహనాలను మంత్రి, ఎంపీ జెండా ఊపి ప్రారంభించారు.

ఆ ఎక్విప్‌మెంట్‌ను జిల్లా హాస్పిటల్‌కి, ఏరియా హాస్పిటళ్లకు అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కొత్త ప్రభాకర్‌ ‌రెడ్డి, బీబీ పాటిల్‌, ‌శాసన మండలి ప్రోటైం చైర్మన్‌ ‌భూపాల్‌ ‌రెడ్డి, శాసన మండలి సభ్యులు ఫరీదుద్దీన్‌, ‌జెడ్పి చైర్‌పర్సన్‌ ‌మంజుశ్రీ, జిల్లా కలెక్టర్‌ ‌హనుమంతరావు, అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, మాజీ శాసనసభ్యులు చింత ప్రభాకర్‌, ‌కీర్బి పరిశ్రమ ఎండీ మరియు సిఈఓ డి. రాజు, డైరెక్టర్‌, ‌జనరల్‌ ‌మేనేజర్‌, అజీమ్‌ ‌ప్రేమ్‌ ‌జీ ప్రతినిధులు, డిఎం అండ్‌ ‌హెచ్‌ఓ ‌గాయత్రి దేవి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply