Take a fresh look at your lifestyle.

ఇం‌తగా ప్రజలను వేధించే ప్రభుత్వాన్ని చూడలేదు

  • ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే వైకాపా పతనం ప్రారంభమైంది
  • ప్రజాస్వామ్య పరిరక్షణకు తెదేపా వీరోచితంగా పోరాడింది
  • మీడియా సమావేశంలో టిడిపి అధినేత చంద్రబాబు

ప్రజలను వేధించే ప్రభుత్వాన్ని ఇదివరకెప్పుడూ చూడలేదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తాజా ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే వైకాపా పతనం ప్రారంభమైనట్లు తెలుస్తోందని, దీనిని ఎవరూ కాపాడలేరని అన్నారు. వైకాపా నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, అరాచకాలు సృష్టించారని విమర్శించారు. మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రజాస్వామ్య పరిరక్షణకు తెదేపా వీరోచితంగా పోరాడిందన్నారు. విపరీతంగా ధరలు పెంచి పన్నుల భారం మోపారని అన్నారు. 4వ విడతలో 41.7 శాతం సర్పంచ్‌ ‌స్థానాలు గెలుచుకున్నాం.

మొత్తం నాలుగు విడతల్లో కలిపి 4,230 సర్పంచ్‌ ‌స్థానాలను గెలిచాం. సక్రమంగా జరిగి ఉంటే మరో 10 శాతం స్థానాల్లో విజయం సాధ్యమయ్యేది.అధికార దుర్వినియోగం, ఫలితాల తారుమారుపై వైకాపా ఆధారపడింది. కేవలం రెండేళ్లకే మిడిసిపడుతున్నారు.. 22 ఏళ్లు తెదేపా అధికారంలో ఉందని గుర్తుంచుకోవాలని చంద్రబాబు అన్నారు. అధికారాన్ని సక్రమంగా వినియోగించుకోవడంలో ఎస్‌ఈసీ విఫలమైందన్నారు. సక్రమంగా నిర్వహించామని ఎన్నికల సంఘం ఎలా చెప్పగలదని ప్రశ్నించారు. ఇదిలావుంటే పంచాయతీ ఎన్నికల నాలుగో దశలో గెలిచిన వైసీపీయేతర అభ్యర్థులను ప్రకటించకుండా ఫలితాలు తారుమారు చేస్తున్నారని రాష్ట్ర ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత చంద్రబాబు ఫిర్యాదు చేశారు.

రాత్రి 10గంటలకూ 40శాతం ఫలితాలు ప్రకటించలేదన్నారు. టీడీపీ మద్దతు అభ్యర్థులకు మూడంకెల మెజారిటీ ఉన్నా రీకౌంటింగ్‌ ‌చేశారని, వైసీపీ నేతలతో పోలీసులు, అధికారులు కుమ్మక్కై, ఫలితాలపై ప్రభావం చూపారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫలితాల ప్రకటనలో జాప్యం, అధికారుల అన్యాయాలు, వైసీపీ అక్రమాలపై ఆదివారం రాత్రి ఎస్‌ఈసీకి చంద్రబాబు రెండు లేఖలు రాశారు. ఈ విషయంలో తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ’స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలపై ఎన్నికల సంఘానికి అనేక ఫిర్యాదులు చేశాం. అయినా అక్రమాలపై, రాజ్యాంగ ఉల్లంఘనలపై ఎలాంటి చర్యలు లేవు. 4వ దశ ఎన్నికల్లో కూడా ప్రతిపక్షాలు బలపర్చిన అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలిచినా, ఫలితాలు దాచి, రాత్రి 8గంటల తర్వాత వైసీపీ బలపర్చినవారికి అనుకూలంగా ప్రకటనలు వెలువరిస్తున్నారు. గత 3దశలతో పాటు 4వ విడతలోనూ అలాంటి ఘటనలే వెలుగుచూశాయి.

చీకటి పడిన తర్వాత ఫలితాల తారుమారులో పోలీసులు, ఎన్నికల విధుల్లోని అధికారులు వైసీపీకి అనుకూలంగా పనిచేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజల తరఫున ఈ అక్రమాలను మరోసారి వి• దృష్టికి తెస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు. ’ఎన్నికల నియమావళి ప్రకారం కౌంటింగ్‌ ‌కేంద్రాల్లో జరగాల్సిన వీడియో రికార్డింగ్‌ ‌పక్రియ ఎక్కడా జరగలేదు. చీకటి పడ్డాక అనేకచోట్ల లైట్లు ఆపేసి, ఫలితాలు తారుమారు చేశారు. సింగిల్‌ ‌డిజిట్‌ ‌మెజారిటీ ఫలితాలు వచ్చినప్పుడు మాత్రమే రీకౌంటింగ్‌ ‌చేయాల్సి ఉన్నా, వైసీపీ గెలుపు కోసం రెండు, మూడంకెల తేడా ఉన్నా చేస్తున్నారు. ప్రతిపక్షాలు బలపర్చిన అభ్యర్థుల గెలుపు ఖాయమైనా, ఫలితాలు దాచిపెట్టి, తర్వాత వైసీపీ అభ్యర్థులు గెలిచినట్లు ప్రకటిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.

Leave a Reply