Take a fresh look at your lifestyle.

దళితుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

“పేద అమ్మాయిల పెండ్లిళ్లకు కల్యాణలక్ష్మి,  మూడు ఎకరాల భూమి, ఉద్యమ కళాకారులకు ఇచ్చిన ఉద్యోగాల్లో ఎక్కువ శాతం దళితులకు ఇచ్చి పాటకు పట్టాభిషేకం చేశారు. విదేశాల్లో విద్యనభ్యసించే దళిత బిడ్డలకు అంబేద్కర్‌ ఓవర్‌ ‌సీస్‌ ‌స్కాలర్‌ ‌షిప్‌ ‌పథకం ద్వారా ప్రతి విద్యార్థికి 20 లక్షలు ఇచ్చి విదేశీ విద్యను ప్రోత్సాహం కల్పిస్తున్నరు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ ‌నడిబొడ్డున డాక్టర్‌ ‌బి.ఆర్‌ అం‌బేద్కర్‌ 125 అడుగుల కాంస్య విగ్రహ ఏర్పాటుకు సంకల్పించడం, వారం రోజుల క్రితమే విగ్రహ నమూనా చిత్రపటాన్ని కేటీఆర్‌  ‌విడుదల చేయడం పనులు శరవేగంగా జరగడం హర్షణీయం.”

ఆధునిక భారతదేశ చరిత్రలో దేశానికి స్వతంత్రం రావడం అతిగొప్ప విజయమైతే అంతటి మరో విజయం స్వాతంత్ర తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం. రాష్ట్రాల పునర్విభజన కమిషన్‌ ‌లో పొందుపరిచిన ముఖ్యమైన అంశాల్లో అంబేద్కర్‌ ‌రెండింటికి ప్రాధాన్యం ఇచ్చారు. ఒకటి పరిపాలనా సౌలభ్యం కాగా, రెండవది సామాజికంగా, ఆర్థికంగా,వెనుకబడిన జాతుల అభివృద్ధికి అవకాశం కల్పించడం. చిన్న రాష్ట్రాల సిద్ధాంతకర్త, కుల నిర్మూలన, దళితుల హక్కుల కోసం పోరాడి భారతదేశపు మార్టిన్‌ ‌లూధర్‌ ‌కింగ్‌ ‌గా పేరుగాంచిన డాక్టర్‌ ‌బి.ఆర్‌ అం‌బేద్కర్‌ ఆలోచన లకు రాష్ట్ర ప్రభుత్వం కార్యరూపం ఇస్తున్నది. అన్ని కులవృత్తులను కాపాడుతూ పల్లె కన్నీరును తుడుస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. కులవృత్తులను ప్రోత్సహించి గ్రామీణ నిరుద్యోగాన్ని పారదోలి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దళితులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నది. దళిత పారిశ్రామికవేత్తలను తయారుచేయడం మునుపటికంటె సులభతరమయింది. వేల కోట్ల రూపాయలతో దళిత,గిరిజన, వెనుకబడిన తరగతులకు, మైనార్టీలకు సంక్షేమ పాఠశాలలు ఏర్పాటు చేయడం దేశ చరిత్రలో ఓ మైలురాయి. వాటి దినదినాభివృద్ధి రాష్ట్ర ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసింది. విద్య కోసం ప్రభుత్వం చేసే కృషి ఎవరెస్టు శిఖరం అయితే జీవచ్ఛవాలుగా ఉన్న వెనుకబడిన కులాల వారి జీవన వృత్తుల ప్రోత్సాహం అంతకంటే ఎక్కువ. ఇవన్నీ ‘‘ రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్‌ అం‌బేద్కర్‌’’ ‌కోరుకున్న సామాజిక ఆర్థికాభివృద్ధి ఆశయాలు, రాజకీయ పదవుల్లో ముఖ్యంగా వ్యవసాయ మార్కెట్‌ ‌కమిటీ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించిన మహనీయుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, అదే కాకుండా టిఆర్‌ఎస్‌ ‌లో కూడా రిజర్వేషన్లు అమలు చేసి చరిత్రలో నిలిచినారు కెసిఆర్‌. ‌

పేద అమ్మాయిల పెండ్లిళ్లకు కల్యాణలక్ష్మి, మూడు ఎకరాల భూమి, ఉద్యమ కళాకారులకు ఇచ్చిన ఉద్యోగాల్లో ఎక్కువ శాతం దళితులకు ఇచ్చి పాటకు పట్టాభిషేకం చేశారు. విదేశాల్లో విద్యనభ్యసించే దళిత బిడ్డలకు అంబేద్కర్‌ ఓవర్‌ ‌సీస్‌ ‌స్కాలర్‌ ‌షిప్‌ ‌పథకం ద్వారా ప్రతి విద్యార్థికి 20 లక్షలు ఇచ్చి విదేశీ విద్యను ప్రోత్సాహం కల్పిస్తున్నరు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ ‌నడిబొడ్డున డాక్టర్‌ ‌బి.ఆర్‌ అం‌బేద్కర్‌ 125 అడుగుల కాంస్య విగ్రహ ఏర్పాటుకు సంకల్పించడం, వారం రోజుల క్రితమే విగ్రహ నమూనా చిత్రపటాన్ని కేటీఆర్‌ ‌విడుదల చేయడం పనులు శరవేగంగా జరగడం హర్షణీయం. దళితుల, గిరిజనుల సమస్యలను క్షేత్ర స్థాయిలో తెలుసుకొని వారి జీవన విధానం, కావలసిన సౌకర్యాలు,పడుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ఆర్థిక సామాజిక ప్రగతి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ,ఎస్టీ కమిషన్‌ ‌ను నియమించింది. ప్రతిష్టాత్మక టీ ఎస్‌ ‌పి ఎస్‌ ‌సి చైర్మన్‌ ‌పదవి దళితునికి ఇవ్వడం. స్వయం ఉపాధిలో రాణించేందుకు ఓనర్‌ ‌కాం డ్రైవర్‌ ‌పథకంలో భాగంగా ఎంతో మంది నిరుద్యోగ ఎస్సీ యువకులకు సబ్సిడీ రుణాల ద్వారా కారులను మంజూరు చేసింది.

ఎస్సీ కార్పొరేషన్‌ ‌ద్వారా పెద్ద మొత్తంలో సబ్సిడీ రుణాలు అందిస్తూ దళితులను స్వయం ఉపాధి లో రాణించే విధంగా ప్రోత్సహిస్తున్నది ప్రభుత్వం. ఇవే కాకుండా ఎస్సీ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ‌సమక్షంలో దళిత ఎమ్మెల్యేల కోరిక మేరకు మరి కొన్ని పథకాలు రూపొందించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం, వాటిలో ఎస్సీ,ఎస్టీ బ్యాక్‌ ‌లాగ్‌ ‌పోస్టులను వేగంగా భర్తీ చేయాలి. వ్యవసాయ ఉపకరణాలైన ట్రాక్టర్లు, నాటు వేసే యంత్రాలు, కోత మిషన్లు, హార్వెస్టర్లు అందించాలి. ఏడాదికి ఎస్సీలకు 5 వేల కోట్లు నిధులు మంజూరు చేయాలని, డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇండ్లు, మూడెకరాల భూమి పధకం కింద కానీసం రూ.10 లక్షలు ఇవ్వాలని సూచనలు చేసినట్లు సమాచారం. తప్పకుండా పెద్ద మనసుతో ముఖ్యమంత్రి అమలు పరుస్తారనే బలమైన నమ్మకం అయితే ఉంది, ఇలా అయితే తెలంగాణ రాష్ట్రంలో దళితులు సంపన్నులే, సమాజంలో దళితుల ఆత్మగౌరవాన్ని, సామాజిక స్థాయి పెంచి జీవితం దళితుల హక్కుల కోసం పోరాడిన అంబేద్కర్‌ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర పరిపాలన సాగుతున్నది. తెలంగాణ ప్రాంత దళితులకి మరో అంబేద్కర్‌ ‌కేసీఆర్‌. ‌దళితులు అభివృద్ధి చెందితే సంతోషించే వ్యక్తుల్లో కేసీఆర్‌ ‌మొదటి వ్యక్తి. వీటితోపాటు ఎస్సీ కార్పొరేషన్‌ ‌చైర్మన్‌ ‌పదవితో పాటు, డైరెక్టర్లను కూడా భర్తీ చేయాలని కోరుకుంటున్నారు దళితులు.

gundamalla satish kumar
గుండమల్ల సతీష్‌ ‌కుమార్‌
‌టిఆర్‌ఎస్వీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, 94931 55522

Leave a Reply