Take a fresh look at your lifestyle.

కొరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలం

  • అమానవీయంగా ప్రవర్తిస్తున్న మంత్రి ఈటల
  • మఠంపల్లిలో అక్రమాలపై ఎస్పీకి ఫిర్యాదు

కరోనా విషయంలో కేసీఆర్‌ ‌ప్రభుత్వం పూర్తిగా విఫల మైందని పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కరోనా విస్పోటన ంపై ప్రజల్లో ఆందోళన నెలకొందన్నారు. సలహాలు ఇస్తున్న ప్రతిపక్షాలను తి•్ట పోస్తున్నారని ధ్వజమెత్తారు. లాక్‌డౌన్‌ ‌సమయంలో వైద్య సదుపాయాలు సమకూర్చుకోలేకపోయారని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గాంధీ ఆస్పత్రిలో అసౌకర్యాలపై బాధితులు వీడియోలు పెడితే వారి పట్ల మంత్రి ఈటల రాజేందర్‌ అమానవీయంగా ప్రవర్తిస్తున్నారని ఉత్తమ్‌ అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకలు కరువయ్యాయని అన్నారు. పరిస్థితి మెరుగుపడాలంటే ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకోవాలని ఉత్తమ్‌ ‌సూచించారు.

ఇదిలాఉండగా జిల్లాలోని మఠంపల్లి మండలంలో అధికార టీఆర్‌ఎస్‌ ‌పార్టీ నేతలపై, స్థానిక పోలీసు అధికారులపై జిల్లా ఎస్పీ భాస్కరన్‌కు ఉత్తమ్‌ ‌ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్‌ ‌పార్టీ కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జిల్లాలో మంత్రి, ఆయన అనుచులరు అక్రమాలకు తెరలేపారని అన్నారు. వారి అవినీతికి అడ్డూఅదుపులేక పోయిందన్నారు. రాష్ట్రంలో కరోనా విస్ఫోటనంపై ప్రజల్లో ఆందోళన నెలకొందన్నారు. సలహాలు ఇస్తున్న ప్రతిపక్షాలను కేసీఆర్‌ ‌తిట్టిపోస్తున్నారని..కరోనా నివారణ చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర సర్కార్‌ ‌విఫలమయ్యిందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో పడకలు కరువయ్యాయని..కరోనా కట్టడిలో ఈటల , సీఎం కేసీఆర్‌ ‌పూర్తిగా విఫలమన్నారు. పరిస్థితి మెరుగుపడాలంటే ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకోవాలన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!