Take a fresh look at your lifestyle.

రియల్‌ ‌వ్యాపారం చేస్తున్న ప్రభుత్వం

  • రేపటి నాడు భూములు అవసరం పడితే ఎలా?
  • టిజెఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌

ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ ‌వ్యాపారిలా వ్యవహరిస్తుందని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ ఆరోపించారు. ఇలా అమ్ముకుంటూ పోతే రేపు భూములు కావాలంటే ఎక్కడి నుంచి వొస్తాయని ఆయన ప్రశించారు. శనివారం ఆయన వి•డియాతో మాట్లాడుతూ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని, రక్షించలేమని ప్రభుత్వమే చెబుతుందని తప్పుబట్టారు. భూములను కాపాడలేని ప్రభుత్వం ప్రజలను ఎలా కాపాడుతుందని కోదండరామ్‌ ‌ప్రశ్నించారు.

ప్రభుత్వ భూములను ధనవంతులకు అప్పగించకుండా ప్రజావసరాలకు వినియోగించాలని డిమాండ్‌ ‌చేశారు. న్యాయ వేదికలను ఉపయోగించుకుని భూముల అమ్మకాన్ని అడ్డుకుంటామని ఆయన అన్నారు. భూములను ప్రజోపయోగాలకు కాకుండా రియల్‌ ఎస్టేట్‌కు వాడడం తగదన్నారు.

Leave a Reply