Take a fresh look at your lifestyle.

రూ.1,850 మద్దతు ధరకు మక్కల కొనుగోలుకు ప్రభుత్వం నిర్ణయం

  • ఆందోళనల నేపథ్యంలో సిఎం కెసిఆర్‌ ‌నిర్ణయం
  • యాసంగి పంటలపై ప్రగతిభవన్‌లో సమీక్ష

మక్క రైతుల ఆందోళనల నేపథ్యంలో మక్కలను కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిర్దేశిత పంటల్లో మక్కలను వేయొద్దని ప్రభుత్వం ఆదేశించినా పలు చోట్ల రైతులు మక్కలను పండించారు. తాజాగా వాటి కొనుగోలు కోసం ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో పరిస్థితిని సవి•క్షించిన సిఎం కెసిఆర్‌ ‌మక్కలను కొనుగోలు చేసేందుకు నిర్ణయించారు. వరి ధాన్యం కొనుగోలు కోసం గ్రామాల్లో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర చెల్లించి, మక్కలు కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

క్వింటాల్‌కు రూ.1,850 మద్దతు ధర చెల్లించి మార్క్‌ఫెడ్‌ ‌ద్వారా కొనుగోలు చేస్తామని, రైతులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. మక్కలకు మద్దతు ధర వచ్చే అవకాశం లేదు కాబట్టి, వర్షాకాలంలో రైతులు మక్కలు సాగు చేయవద్దని ప్రభుత్వం కోరిందని, అయినప్పటికీ రైతులు మక్కల సాగు చేశారని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. వద్దంటే మక్కలు సాగు చేశారని, వాస్తవానికి ప్రభుత్వానికి మక్కలు కొనుగోలు చేసే బాధ్యత లేదని సీఎం అన్నారు. అయినప్పటికీ రైతులు నష్టపోవద్దనే ఏకైక కారణంతో ప్రభుత్వం నష్టాన్ని భరించడానికి సిద్ధపడి మక్కలు కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు కేసీఆర్‌ ‌వెల్లడించారు. యాసంగి పంటలపై శుక్రవారం సిఎం కెసిఆర్‌ ‌ప్రగతిభవన్‌లో సవి•క్షించారు. పంటల విధానంతో పాటు మక్క రైతుల ఆందోళనపై చర్చించారు. ఇందులో సిఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply