Take a fresh look at your lifestyle.

రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి : పువ్వాడ

ఖమ్మం ఏప్రిల్‌ 23, ‌ప్రజాతంత్ర (ప్రతినిధి) :రైతు సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్ణి, కరోనా మహమ్మారి వ్యాధి నేపధ్యంలో సైతం ఎక్కడా కూడా రైతులు ఇబ్బందులు పడ కూడదనే ఉద్దేశ్యంతో కొనుగోలు కేంద్రాలను •రైతుల చెంతకు తీసుకవచ్చామని మంత్రి పువ్వా డ అజయ్‌కుమార్‌ అన్నారు. గురువారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు ప్రాంతాల్లో ధా న్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టామన్నారు. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. కామేపల్లి మండలం పండితాపురం గ్రా మంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే హరిప్రియతో కలిసి ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ ‌కుమార్‌ ‌ప్రారం భించారు.

- Advertisement -

అనంతర మధిర నియోజకవర్గం బోనకల్‌ ‌మండలం ముష్టి కుంట, బోనకల్‌ ‌లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం, మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాలను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ ‌కుమార్‌ ‌ప్రారంభిం చారు. అనంతరం బోనకల్‌-‌వత్సవాయి రాష్ట్ర సరిహద్దు వద్ద చెక్‌ ‌పోస్ట్ ‌ను పరిశీలించారు. కార్యక్రమంలో విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్‌ ‌కొండబాల కోటేశ్వరరావు, జడ్పీ చైర్మన్‌ ‌లింగాల కమల్‌ ‌రాజ్‌ , ‌రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వర రావు, జిల్లా కలెక్టర్‌ ‌కర్ణన్‌, అదనపు కలెక్టర్‌ ‌మధుసూదన్‌, ‌జిల్లా వ్యవసాయ అధికారి విజయ నిర్మల, ఆర్డీఓ రవీంద్రనాథ్‌, ‌మార్కుఫెడ్‌ ‌డిఎం సుధాకర్‌ ‌తదితరులు ఉన్నారు.

Leave a Reply