- అమరావతి శాసన రాజధాని
- సిఆర్‌డిఎ రద్దు..ఎఎంఆర్డీఏకు గ్రీన్ సిగ్నల్
- ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై లోకాయుక్త విచారణ
- రాష్ట్రం నాలుగు పరిపాలనా జోన్లుగా విభజన
- ఎపి మంత్రిమండలి నిర్ణయాలు
- హైపవర్ కమిటీ నివేదికకు కేబినేట్ ఆమోదం
అమరావతి, జనవరి 20: ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధానిగా విశాఖపట్టణం, శాసన రాజధానిగా అమరావతి, కర్నూలులో హైకోర్టుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. సోమవారం అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. హైపవర్ కమిటీ నివేదికను మంత్రివర్గం ఆమోదించింది. పరిపాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి బిల్లుకు ఆమోదం తెలిపింది. సిఆర్‌డీఏ రద్దుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పులివెందుల అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుకు, ఎఎంఆర్డీఏ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం లభించింది. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు సంబంధించి లోకాయుక్త విచారణ జరపాలని మంత్రివర్గం తీర్మానించింది. రైతుల కూలీలకు ఇచ్చే పరిహారాన్ని రూ.2,500 నుంచి రూ.5 వేలకు పెంపు,రైతులకు 15 ఏళ్లపాటు కౌలు చెల్లించేందుకు నిర్ణయం తీసుకున్నారు. రాజధాని ప్రాంతంలో ప్లాట్లు అభివృద్ధి చేసి రైతులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్టాన్న్రి 4 పరిపాలన జోన్లులా విభజించాలని,జిల్లాల విభజన తర్వాత సూపర్ కలెక్టరేట్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని కేబినేట్‌లో నిర్ణయించారు.
Tags: super collectorate, insider trading, rhythu barosa