Take a fresh look at your lifestyle.

శాసనమండలికి గోరెటి ఎంకన్న .. బస్వరాజు సారయ్య, దయానంద్‌

  • గవర్నర్‌ ‌కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులు
  • సిఫార్సు చేసిన రాష్ట్ర కేబినేట్‌
  • గవర్నర్‌ ‌కోటాలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు

అభ్యర్థులను తెలంగాణ మంత్రివర్గం ఖరారు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌సమక్షంలో జరిగిన సమావేశంలో పేర్లను ఖరారు చేస్తూ కేబినెట్‌ ‌నిర్ణయం తీసుకుంది. ప్రముఖ ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న, మాజీ మంత్రి, రజక సంఘం జాతీయ నాయకుడు బస్వరాజు సారయ్య, వాసవి సేవాకేంద్రం చీఫ్‌ అడ్వయిజర్‌, ఆర్యవైశ్య సంఘం నాయకుడు బొగ్గారపు దయానంద్‌ ‌పేర్లను కేబినెట్‌ ‌ఖరారు చేసింది.

ఈ పేర్లను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌ ఆమోదానికి పంపింది. వీరి అభ్యర్థిత్వాలను ఆమోదించగానే వారు శనివారం ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేస్తారు. వరంగల్‌ ‌తూర్పు నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ ‌పార్టీ నుంచి ఎన్నికై , రాష్ట్ర మంత్రిగా సారయ్య పనిచేశారు. 2016లో కాంగ్రెస్‌ ‌నుంచి టీఆర్‌ఎస్‌లో చేరారు. త్వరలోనే గ్రేటర్‌ ‌వరంగల్‌ ఎన్నికల నేపథ్యంలో నగరానికి చెందిన బీసీ నేత బస్వరాజు సారయ్యకు అవకాశం కల్పిస్తూ టీఆర్‌ఎస్‌ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.

Leave a Reply