Take a fresh look at your lifestyle.

మాస్కులతో వస్తేనే సరుకులు ఇవ్వాలి

వికారాబాద్‌ : ‌ప్రభుత్వం లాక్‌ ‌డౌన్‌ ‌సడలింపులు ఇచ్చిందని ప్రజలు అనవసరంగా బయటకు రావద్దని జడ్పి చైర్‌ ‌పర్సన్‌ ‌సునీతారెడ్డి సూచించారు. నిత్యావసర సరుకులు కొనుగోలు చేయడానికి వచ్చే కస్టమర్లు మాస్క్‌లు ధరించకుండా వస్తే వారికి సామగ్రి అమ్మరాదని జిల్లాలోని వ్యాపారస్తులకు సునీతారెడ్డి పిలుపునిచ్చారు. అలాగే తమ వ్యాపార సముదాయాల ముందు కచ్చితంగా శానిటైజర్స్ ఉం‌చాలని సూచించారు.

ముఖ్యంగా తాండూరు, వికారాబాద్‌ ‌మార్కెట్లలో జనాల రద్దీ ఎక్కువగా కనిపిస్తుందని ఆందోళన వ్యక్తం చేసిన చైర్‌ ‌పర్సన్‌ ‌ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించాలని తెలిపారు. కూరగాయలు, నిత్యావసర సరుకుల కోసం రోజు మార్కెట్‌కు వెళ్ళొదని సూచించారు. ప్రజలు బయటికి ఎలాంటి పనుల నిమిత్తం వెళ్లిన మాస్కులను తప్పనిసరిగా ధరించి నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy