- మంత్రి పెద్దిరెడ్డిని అభినందించిన సిఎం జగన్
- చంద్రబాబు పని అయిపోయిందన్న మంత్రులు
స్థానిక సంస్థల ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు అత్యధిక స్థానాల్లో గెలుపొందడంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని సీఎం వైఎస్ జగన్ అభినందించారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు.మంత్రులు, ఎమ్మెల్యేల భేటీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన కృష్ణా జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేల భేటీ జరిగింది. మున్సిపల్ ఎన్నికలపై మంత్రి పెద్దిరెడ్డి దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు ప్రభంజనం సృష్టించారన్నారు. సీఎం వైఎస్ జగన్ పనితీరుకు ఫలితాలే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఏదో సాధించాలని చతికిలపడ్డారు. టీడీపీ పునాదులు కదులుతున్నా అసత్య కథనాలు రాయిస్తున్నారు. 80.37 శాతం పంచాయతీలను వైఎస్సార్ సీపీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. ఎన్నికలు సజావుగా జరిగితే 90 శాతానికి పైగా గెలిచేవాళ్లం. సీఎం జగన్ సుపరిపాలనకు ప్రజలు పట్టం కట్టారు. ప్రజాస్వామ్యానికి అద్దం పట్టేలా ఫలితాలు వచ్చాయి. కుప్పం ఫలితాలే చంద్రబాబు పై వ్యతిరేకతకు నిదర్శనం. మున్సిపల్ ఎన్నికల్లో ఇంతకంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామని మంత్రి పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో 42 శాతం గెలుపు ఎక్కడ వచ్చిందో చంద్రబాబు చెప్పాలని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. చంద్రబాబుకు పిచ్చెక్కి మాట్లాడుతు న్నారని, గెలిచిన 42 శాతం అభ్యర్థులు ఎవరో ప్రకటించాలని సవాల్ చేశారు. ఆయన్ని టీడీపీ నేతలు ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రికి పంపడం ఖాయమని మంత్రి ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన వి•డియాతో మాట్లాడుతూ.. మా నాయకుడు సీఎం వైఎస్ జగన్ చంద్రబాబుకు కుప్పంలో కూడా చుక్కలు చూపించారు. కుప్పంలోనే మేము 75 స్థానాలు గెలిస్తే ఇక బాబు ఎక్కడ 42 శాతం గెలిచినట్టు. చంద్రబాబు పిచ్చి ప్రేలాపణలు మానుకోవాలి. ఆయన జూమ్‌యాప్‌లో కూర్చుని పగటి కలలు కంటున్నారు.టీడీపీ తమ్ముళ్లకు నాదో సలహా.. బాబు పిచ్చితో తెలంగాణాలో పార్టీని భూస్థాపితం చేశారు. ఇప్పటికైనా ఆయన్ని తమ్ముళ్లు పిచ్చాసుపత్రిలో చేర్చాలి. లేదంటే ఏపీలో కూడా పార్టీ భూస్థాపితమే అవుతుంది. గుర్తులేని పంచాయతీ ఎన్నికల్లోనే ప్రజలు సీఎం వైఎస్ జగన్‌కు బ్రహ్మరథం పట్టారు. ఇక పార్టీ గుర్తుతో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో విజయం మాదే. రాష్ట్రంలోఎన్నికలు జరిగే అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కైవసం చేసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.