Take a fresh look at your lifestyle.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

డీఏ 17 శాతం నుంచి 28 శాతానికి పెంపు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం శుభ వార్తను అందించింది. డీఏ 11 శాతం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ప్రస్తుతం 17 శాతం ఉన్న డీఏను 28 శాతానికి పెంచాలని నిర్ణయించింది. బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో 7వ పే కమిషన్‌ ‌సిఫారసులపై చర్చ జరిగింది.

కొరోనా మహమ్మారి వ్యాప్తి..లాక్‌ ‌డౌన్‌ ‌కారణంగా కేంద్ర ఉద్యోగులకు గత ఏడాది అంటే 2020 జనవరి నుంచి డీఏ పెంపు పెండింగ్‌లో ఉండిపోయింది. ఇప్పటి వరకు మూడు డీఏలు పెండింగ్‌లో ఉండిపోయాయి. మరో వైపు 2021 జులై నుంచి కొత్త డీఏ అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపధ్యంలో మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో డీఏ పెంపు పట్ల కేబినెట్‌ ‌సానుకూలం వ్యక్తం చేసి 11 శాతం పెంపునకు ఆమోదం తెలిపినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

Leave a Reply