Take a fresh look at your lifestyle.

బుస్సాపూర్‌, ‌వెంకటాపూర్‌ ‌గ్రామాలకు శుభవార్త

  • లిఫ్టు పెట్టి పైప్డ్ ఇరిగేషన్‌తో కాళేశ్వరం జలాలు ఎత్తి పోయిస్తా,, మంత్రి హరీష్‌ ‌రావు హామీ

బుస్సాపూర్‌, ‌వెంకటాపూర్‌ ‌గ్రామాలకు..మంత్రి హరీష్‌ ‌రావు తీపి కబురు చెప్పారు. ఆ రెండు గ్రామాలకు కాళేశ్వరం జలాలు రావడం లేదని గ్రామస్తుల విన్నపం మేరకు లిఫ్టు పెట్టి పైప్డ్ ఇరిగేషన్‌ ‌తో.. కాళేశ్వరం జలాలు ఎత్తి పోయిస్తానని మంత్రి హామీనిచ్చారు. నాల్గవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రమైన సిద్ధిపేట రూరల్‌ ‌మండలం బుస్సాపూర్‌లో శనివారం రూ.12 లక్షల రూపాయలతో నిర్మించిన గౌడ సామూహిక భవనాన్ని, ఆ తర్వాత డ్రైనేజీ నిర్మాణ పనులు, శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరణ, అంగన్‌ ‌వాడీ భవనాన్ని, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని, గ్రామ ఫంక్షన్‌ ‌హాల్‌, ‌పల్లె ప్రకృతి వనాన్ని మంత్రి హరీష్‌ ‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేజ్‌ ‌ఫంక్షన్‌ ‌హాల్‌లో ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ…గ్రామ ఫంక్షన్‌ ‌హాల్‌ ‌నిర్మాణంతో పదేళ్ల రంది తీరిందని, అలాగే ఎన్నో ఏళ్ల నుంచి గ్రామానికి మూడు దిక్కులా రోడ్లు నిర్మించాలని గ్రామస్తులంతా విన్నవించే వారని, గతంలో ఎన్నోసార్లు మీకు ఇచ్చిన మాటను ఇవాళ నిలబెట్టుకున్నానని మంత్రి చెప్పారు.

గ్రామం మీదుగా రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు, గుడికందుల నుంచి బుస్సాపూర్‌, ‌వెంకటాపూర్‌, ఏన్సాన్‌ ‌పల్లి, భట్టి రామన్నపల్లి మీదుగా రాజీవ్‌ ‌రహదారి వరకూ రూ.14.50 కోట్ల రూపాయల వ్యయంతో డబుల్‌ ‌లేన్‌ ‌రోడ్డు మంజూరైందని, వారం, పది రోజుల్లో పనులు ప్రారంభం చేసుకుందామని పేర్కొన్నారు. గ్రామంలో ఎల్లమ్మ దేవాలయం వద్ద ఫంక్షన్‌ ‌హాల్‌, ‌పక్కనే అందమైన పల్లె ప్రకృతి వనం, కొత్త స్కూల్‌, ‌బతుకమ్మ మెట్లు, ఓపెన్‌ ‌జిమ్‌, ‌సీసీ కెమెరాలు, గౌడ కమ్యూనిటీ హాల్‌ ‌ప్రారంభం చేసుకోవడం ఆనందంగా ఉన్నదని తెలిపారు.

బ్యాంకులలో అప్పు పుట్టదు., కానీ వాన చినుకు పడక ముందే రైతుల బ్యాంకు ఖాతాల్లో సీఎం కేసీఆర్‌ ‌రైతుబంధు వేస్తున్నారని పేర్కొన్నారు. వరి వెద సాగు పద్ధతిలో సాగు చేపట్టాలని, పామాయిల్‌ ‌తోటల పెంపకం చాలా లాభసాటిగా ఉన్నదని ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ వివరిస్తూ.., పామాయిల్‌ ‌తోటల పెంపకానికి రైతులు ముందుకురావాలని మంత్రి కోరారు.

Leave a Reply