తాడేపలి? : పాడి రైతులకు మేలు జరగాలని ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షించారు. వారు ఉత్పత్తి చేస్తున్న పాలకు మంచి ధర రావాలని.. ధరల విషయంలో రైతులకు న్యాయం జరగాలని అన్నా రు.శుక్రవారం షుగర్ ఫ్యాక్టరీలు,మిల్క్ డెయిరీల అభివృ ద్ధిపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు.ఈ సమీక్షకు వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ సంద ర్భంగా పాడి పరిశ్రమ అభివృద్ధిపై చర్చించడంతోపాటుగా అమూల్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చు కోవాలని నిర్ణయిం చారు.అమూల్‌తో భాగస్వా మ్యంపై విధివిధానాలు ఖరారు చేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులకు సూచించారు. పశువులకు మంచి వైద్యం, సంరక్షణ,ఉత్పత్తులకు మార్కెటింగ్ దిశగా అడుగులు వేయాలన్నారు. సహకార రంగం బలోపేతం,పాడి రైతుల కు అదనపు ఆదాయమే లక్ష్యంగా కృషి?చేయాలని ఆదేశి ంచారు.