Take a fresh look at your lifestyle.

గోండు వీర్‌..‌ కొమురం భీమ్‌ !

‌విప్లవాల పతాక
ధిక్కారాల గొంతుక
గిరిజనోద్యమాల తారక
అతడే ..!
గోండు వీర్‌..‌కొమురం భీమ్‌

ఆదివాసీల హక్కుల కోసం
సాయుధ ‘‘పోరు సాగించాడు

జల్‌,‌జమీన్‌,‌జంగిల్‌ అం‌టూ…
జంగ్‌ ‘‘‌సైరన్‌ ‌జమాయించాడు

దున్నేవాడిదే భూమి అంటూ ..
దండుగా దండోర మోగించాడు

నిజాం దోపిడీ పాలనపై
తిరుగుబాటు జెండా ఎగరేసాడు

తుడుం దెబ్బతో రజాకార్ల
గుండెల్లో గుబులు పుట్టించాడు

గెరిల్లా యుద్ధ తంత్రంతో
పెత్తందార్ల తన్ని తరిమికొట్టాడు

గిరిజనుల సంఘటితం చేసి
దోపిడీ మూకలపై దండెత్తాడు

సేచ్చ కోసం …
ఆత్మ గౌరవం కోసం …
స్వయం పాలన కోసం …
అలుపెరుగని పోరు సాగించి
అమరత్వాన్ని హత్తుకున్నాడు

త్యాగాల ధీరుడా …
ఉద్యమాల వీరుడా …
అభ్యుదయాల భానుడా..
కామ్రేడ్‌…‌కొమురం భీమ్‌ !
‌గోండు తండాల లాల్‌ ‌సలామ్‌
‌గిరిజన గూడాల విప్లవ జోహార్‌

(అక్టోబర్‌ 22 ‌కొమురం భీమ్‌ ‌జయంతి సందర్భంగా నీరాజనాలు అర్పిస్తూ..)
– కోడిగూటి తిరుపతి,9573929493

Leave a Reply