పాల్వంచ డిఎస్పీ కె.ఆర్.కె.ప్రసాద్ ఆదేశాల మేరకు బుధవారం నాడు ఉదయం సమయంలో పాల్వంచ పట్టణ సిఐ సత్యనారాయణ మరియు ఎస్సై ప్రవీణ్ కుమార్ తమ సిబ్బందితో కలిసి అంబేద్కర్ సెంటర్ నందు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు ఏపి20ఏఆర్ 3747 అను నెంబరు గల హీరో హోండా స్కూటీపై ఒక సంచితో అనుమానాస్పదంగా వస్తుం డగా,వారిని పట్టుకొని విచారించగా సుందరయ్య నగర్ , శేఖరం బజార్ కు చెందిన పూసపాటి శ్రీనివాస్ఏ సిండికేట్ శ్రీను, మరియు పాల్వంచ మండలం లోని ని నవభారత్ సోనియా నగర్ కు చెందిన ఐనాల కృష్ణ గా చెప్పినట్లు పాల్వంచ డిఎస్పి కె.ఆర్కె ప్రసాద్ తెలిపారు. అనంతరం అనుమానాస్పదంగా కనిపిస్తున్న వీరిరువురి వద్ద ఉన్న సంచిని తనిఖీ చేయగా అందులో బంగారు మరియు వెండి వస్తువులను గుర్తించడం జరిగింది.
పూర్తిస్థాయిలో విచారించగా పూసపాటి శ్రీనివాస్ అనే వ్యక్తి చిన్నతనం నుండి దొంగతనాలు చేస్తూ మద్యానికి బానిసై జులాయిగా తిరిగేవాడని,1987 నుండి 1993 వరకు పాల్వంచ ఏరియాలో దొంగతనాలు చేసినాడు.ఇతనిపై పాల్వంచ పోలీస్ స్టేషన్ లో 14 కేసులు నమోదు కాబడి ఉన్నాయని తేలింది.ఇట్టి 14 కేసులలో ఆరు నెలల చొప్పున జైలు శిక్షను కూడా అనుభవించాడు. అంతేకాకుండా పాల్వంచ టౌన్ పోలీస్ స్టేషన్లో ఇతనిపై కేడి షీట్ కూడా ఉంది. 2006 సంవత్సరం నుండి 2018 సంవత్సరం వరకు పాల్వంచలోని ఒక వైన్ షాప్ లో పని చేసినాడు. అనంతరం కేటీపీఎస్ సంస్థ నందు లేబర్ గా పని చేస్తూ, రెండో వ్యక్తి అయిన ఐనాల కృష్ణతో పరిచయం ఏర్పరచుకొని, విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి దొంగ తనాలు చేసి డబ్బులు సంపాదిం చడం మొదలుపెట్టినారు. వీరిరు వురు కలిసి 2019 వ సంవత్సరం నుండి పాల్వంచ పట్టణ పరిధిలోని వివిధ ప్రాంతాలలోని ఇళ్లకు తాళాలు పగలగొట్టి, బీరువాల నుండి బంగారు వస్తువులను రెండు వస్తువులను దొంగలించారు. వీరిరువురు మీద మొత్తం పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్లో 17 కేసులు నమోదయ్యాయి. వీరిరువురు వద్దనుండి 575 గ్రాములు సుమారుగా 15,99,000/-ల రూపాయల బంగారు వస్తువులను, 4.5కేజీలు సుమారుగా 2,44, 000ల రూపాయల వెండి వస్తువు లను మరియు ఒక గ్యాస్ సిలిం డర్,సెల్ ఫోన్ ను స్వాధీన పరచుకోవడం జరిగినదని బుధ వారం పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్పీ కె.ఆర్.కె ప్రసాద్ వెల్లడించారు. ఇద్దరు నేరస్తులను చాకచక్యంగా పట్టుకున్న సీఐ సత్యనారాయణ,ఎస్ఐ ప్రవీణ్ మరియు కానిస్టేబుళ్ళు లక్ష్మణ్,ప్రసాద్ మరియు హోంగార్డు రవిలను డిఎస్పీ అభినందించారు. వీరికి రివార్డులను అందజేయడం జరుగుతుందని తెలియజేశారు.