– 24 క్యారెట్ల ధర రూ.1,51,530కి చేరిక
– 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,38,900
– రూ.3 లక్షలకు కిలో వెండి ధర
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2: ఇటీవలి కాలంలో భారీగా పెరిగిన వెండి, బంగారం ధరలు నాలుగైదు రోజులుగా అంతే స్థాయిలో పతనమవుతున్నాయి. ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్న బంగారం, వెండి ధరల్లో భారీగా లాభాల స్వీకరణ జరుగుతుండడమే దీనికి కారణంగా కనిపిస్తోంది. కొనుగోలుదారులకు ఆనందాన్ని కలిగించకున్నా కొంతమేర దిగివస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,51,530కి చేరింది. నిన్నటి ధరతో పోల్చుకుంటే రూ.9,050 లు తగ్గింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,900కి చేరింది. నిన్నటి ధరతో పోల్చుకుంటే రూ.8,300 తగ్గింది. దేశ రాజధాని దిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,51,680కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,39,050కి చేరుకుంది. మరోవైపు ఇటీవల భారీగా పెరిగిన వెండి ధరలు కూడా వేగంగా దిగివస్తున్నాయి. ఐదు రోజుల క్రితం రూ.4.25 లక్షలకు చేరిన కిలో వెండి కొద్ది రోజుల్లోనే తిరిగి రూ.3 లక్షలకు చేరుకుంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే కిలోకు రూ.50 వేల మేర తగ్గింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.3 లక్షలుగా ఉంది. దిల్లీలో కిలో ధర రూ.3 లక్షలుగా ఉంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



