Take a fresh look at your lifestyle.

“బంగారు మనిషి ..” కన్నుమూత అతి కొద్దిమంది తో అంత్యక్రియలు

ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి,న్యూ దిల్లీ: “బంగారు మనిషి” గా ప్రాచుర్యం పొందిన 39 ఏళ్ల సామ్రాట్ హిరామన్ మోజ్ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించాడు.మహారాష్ట్ర సంగంవాడి ప్రాంతంలో నివసించే హిరామన్ మోజ్ నిత్యం ఎనిమిది నుండి 10 కిలోల బంగారం ధరించి బాగా పాపులర్ అయ్యాడు. ఇతనికి సంబంధించిన వీడియో క్లిప్స్ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా పాపులర్. ఇతను తనదగ్గరున్న బంగారం మొత్తం అయినవారి దగ్గర వదిలేసి కనీసం ఆవగింజంత బంగారం కూడా తీసుకెళ్లకుండా చనిపోయాడు. ఇతను బంగారం వేసుకుని డాబుగా బయటికి వస్తే ఇతనితో తిరిగే వందిమాగధులు కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు అవుతున్న కారణంగా అతని చివరి కర్మల కార్యక్రమంలో కూడా హాజరు కాలేకపోయారు.. ఇతని అంత్యక్రియలు అతికొద్ది మంది సమక్షంలో యెర్వాడాలో జరిగాయి. బతికి వున్నప్పుడు మోజ్ మంచిగా రాజకీయ సంబంధాలు కలిగిన వ్యాపారవేత్త. మాజీ ఎమ్మెల్యే రంభౌ మోజ్ మేనల్లుడు, సంగంవాడి నుండి ఎన్నికలలో పోటీ చేయటానికి కూడా అతను ఆశపడ్డాడు.పిన్న వయసులో కాలం చేసిన సామ్రాట్ హిరామన్ మోజ్ కు భార్య, ఇద్దరు పిల్లలు అలాగే తల్లి ఉన్నారు.

ఇటువంటి ఉదాహరణలు మహారాష్ట్రలో మరికొన్ని కూడా వున్నాయి.. జూన్ 2011 లో, పూణే “బంగారు మనిషి” గా ప్రసిద్ది చెందిన ఎంఎన్ఎస్ ఎమ్మెల్యే రమేష్ వంజాలే 45 సంవత్సరాల వయస్సులో గుండెపోటుతో మరణించారు. వంజాలే మరణించినప్పుడు ఖడక్వాస్లా నియోజకవర్గం ఎమ్మెల్యే గా వున్నారు. ఈయన కూడా అనేక బంగారు ఆభరణాలు ధరించేవారు. 2009 అసెంబ్లీ ఎన్నికలలో ఆయన ప్రత్యర్ధులు ఈ విషయంపై ప్రచారం సందర్భంగా విమర్శలు గుప్పించారు. చాలా బంగారం ఉండి బంగారం వంటి ఆరోగ్యం లేక తక్కువ వయసులో మరణించారు. మరో సంఘటన జూలై 2016 లో జరిగింది.పింప్రి-చిన్చ్వాడ్ మునిసిపల్ కార్పొరేషన్ మాజీ కార్పొరేటర్ సీమా ఫుగే భర్త దత్తాత్రే ఫ్యూజ్. ఇతను 47 ఏళ్ల వ్యాపారవేత్త, ఇతను 2012 లో “బంగారు చొక్కా” కొన్నందుకు వార్తల్లో నిలిచాడు.2016 లో ఇతను డిఘీ ప్రాంతంలో తన కొడుకు కళ్ళ ముందే 12 మంది ముఠా చేత చంపబడ్డాడు. తన ఇలాకాలో దత్తా అని పిలవబడే దత్తాత్రే ఫ్యూజ్, భోసరి ప్రాంతంలో వక్రతుండా చిట్ ఫండ్ కంపెనీని నడిపేవాడు. 3.5 కిలోల బంగారంతో తయారు చేసిన 1.29 కోట్ల రూపాయల విలువైన చొక్కా ధరించిన దత్తాత్రే ఫ్యూజ్ అప్పటిలో ఓ సెన్సేషన్ అయ్యారు. బంగారం యెంత ఉన్న లాభం లేదని తెలిపే ఉదాహరణలుగా నిలిచిన వ్యక్తులుగా ఈ సోషల్ మీడియా సెన్సేషన్ బంగారం ప్రేమికులు నిలిచారు.

Leave a Reply