అసలే బంగారం ధర అందనంత ఎత్తుకు పరుగులు పెడుతుంటే..అమ్మకాలు మాత్రం 26 ఏళ్ల కనిష్టస్థాయికి పడిపోయాయి. బంగారం ధరలు అమాంతంగా పెరుగుతున్నా డిమాండ్ పడిపోవడంతో బంగారం కోనేవారే లేకుండా పోతున్నారు. బంగారం అంటే ఎంతో ఇష్టపడే భారతీయులు పసిడి కొనుగోలు చేయడానికి ఇప్పుడు ఆసక్తి చూపడం లేదు.. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) తాజాగా వెల్లడించిన అంశాలను పరిశీలిస్తే.. భారత్‌లో బంగారం డిమాండ్ 2020లో ఏకంగా 26 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిందని అంచనా వేసింది. ఓవైపు అంతర్జాతీయ పరిస్థితులు బంగారం ధర పెరగడానికి ఊతం ఇవ్వగా.. కొరోనా కారణంగా డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం పడిందని డబ్ల్యూజీసీ పేర్కొంది. భారత్‌లో బంగారం ధర ఆల్‌టైమ్ హైకి చేరి కొత్త రికార్డులను నెలకొల్పింది. దేశీ మార్కెట్లో బంగారం ధర ఈ ఏడాది ఏకంగా 35 శాతానికి పైగా పెరిగింది. బంగారం ధరపై 12.5 శాతం దిగుమతి సుంకం, 3 శాతం జీఎస్టీ కూడా బాదేస్తున్నారు.
దీంతో ఈ ఏడాది తొలి అర్థభాగంలో బంగారం డిమాండ్ భారీగా తగ్గిందని, దీని ప్రభావం మొత్తం ఏడాదిపై పడుతుందని డబ్ల్యూజీసీ పేర్కొంది. 1994 నాటి 415 టన్నుల కనిష్ట స్థాయికి బంగారం దిగుమతి పడిపోవచ్చని అంచనా వేసింది. ఈ ఏడాది తొలి అర్థభాగంలో పసిడి డిమాండ్ 56 శాతం పతనమైపోయింది. అది ఏకంగా 165 టన్నులకు దిగివచ్చింది. ఇక, లాక్ డౌన్ కారణంగా జూన్ తైమ్రాసికంలో డిమాండ్ 70 శాతం పడిపోయింది. 63 టన్నులకు తగ్గిపోయింది. దశాబ్ద కాలంలో ఇదే కనిష్ట స్థాయి అని పేర్కొంది. ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులతోపాటు.. సాధారణ ప్రజలకూ అత్యంత ప్రీతిపాత్రమైన బంగారం, వెండి ధరలు మరింత ప్రియమయ్యాయి. బులియన్ చరిత్రలో తొలిసారి అటు ఫ్యూచర్స్,.. ఇటు స్పాట్ మార్కెట్లలో బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి(అక్టోబర్ ఫ్యూచర్స్) రూ. 219 పుంజుకుని రూ. 54,770 వద్ద ట్రేడవుతోంది. సెప్టెంబర్ ఫ్యూచర్స్ వెండి కేజీ ధర సైతం రూ. 64 బలపడి రూ. 69,861 వద్ద కదులుతోంది. సప భవిష్యత్‌లో ఔన్స్ పసిడి 2500 డాలర్లను తాకే వీలున్నట్లు యూఎస్‌కు చెందిన బులియన్ సాంకేతిక విశ్లేషకులు విడ్మర్, ఫ్రాన్సిస్కో బ్లాంచ్ అభిప్రాయపడ్డారు.