Take a fresh look at your lifestyle.

పంద్రాగస్ట్ ‌వేడుకలకు గోల్కొండ కోట ముస్తాబు

  • భారీ పోలీస్‌ ‌బందోబస్తు ఏర్పాటు
  • జెండా ఎగురేసి ప్రజలకు సందేశం ఇవ్వనున్న సిఎం కెసిఆర్‌
  • ‌జిల్లాల్లో జెండా ఎగురేయనున్న మంత్రులు

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు చారిత్రక గోల్కొండ కోట ముస్తాబైంది. తెలంగాణ ఏర్పడ్డ తరువాత ఇక్కడ జాతీయ జెండాను ఆవిష్కరించాలన్న సిఎం కెసిఆర్‌ ‌తీసుకున్న నిర్ణయంతో ఈయేడు కూడా కెసిఆర్‌ ‌గోల్కొండకోటలోనే జెండా ఎగురేయబోతున్నారు. ఇక్కడి నుంచే ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తన పాలనలో తీసుకున్న చర్యలను, సాధించిన విజయాలను వివరిస్తారు. రానున్న రోజుల్లో తీసుకోబోయే కార్యక్రమాలను విడమరుస్తారు. ప్రధానంగా ఈ యేడు దళితబంధు ప్రధాన అంశం కానుంది. అలాగే అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పిస్తారు. జిల్లాల్లో మంత్రులు,అధికారులు జెండా ఎగురేస్తారు.

గోల్కొండ కోట ముస్తాబు
గతంలో పరేడ్‌ ‌గ్రౌడ్స్‌లో జరిగిన పంద్రాగస్ట్ ‌వేడుకలు గోల్కొండ వేదికగా సాగుతున్నాయి. దీంతో ఈ యేడు కూడా పంద్రాగస్టు వేడుకలకు చారిత్రక గోల్కొండకోటను అన్ని రకాల హంగులతో ముస్తాబు చేసారు. భద్రత కార్యక్రమాల రిహార్సల్స్‌తోపాటు పోలీసు, వివిధ భద్రత బలగాలు కవాతు నిర్వహించాయి. నిఘావర్గాల సూచనల మేరకు అన్నిరకాల భద్రతా చర్యలు తీసుకుంటున్నట్టు సీనియర్‌ ‌పోలీస్‌ అధికారులు చెప్పారు. కేంద్ర నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో పోలీస్‌శాఖ భారీబందోబస్తు ఏర్పాటుచేసింది. వేడుకలు జరిగే హైదరాబాద్‌లోని గోల్కొండ కోట పరిసరాల్లో ఐదువేల మంది పోలీసులను మోహరించింది. ఇందుకు పోలీసుశాఖలోని అన్ని విభాగాల సేవలను వినియోగిస్తున్నట్టు సీనియర్‌ అధికారులు తెలిపారు.

వేడుకలకు ముఖ్యమంత్రి కాన్వాయ్‌ ‌వొచ్చే రూట్‌లో భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు. పంద్రాగస్టు వేడుకలకు గోల్కొండ కోట ముస్తాబు కాగా సందర్శకులను పరిమిత సంఖ్యలనే అనుమతించి పాసులు జారీ చేశారు. భద్రత నేపథ్యంలో పోలీసు, పురావస్తుశాఖల అధికారులు ఇప్పటికీ సమిక్షించారు. నగర పోలీస్‌ ‌కమిషనర్‌ అం‌జనీకుమార్‌ ఆధ్వర్యంలో గోల్కొండకోట వద్ద భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. ప్రగతిభవన్‌ ‌నుంచి గోల్కొండకోట కాన్వాయ్‌ ‌వెళ్లే మార్గాన్ని పరిశీలించారు. దారి పొడువునా తీసుకోవాల్సిన జాగ్రత్తలను పరిశీలించారు. ఆయాప్రాంతాల్లో బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులకు కూడా పలుసూచనలు చేశారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గోల్కొండ, ఆ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆం‌క్షలు, ట్రాఫిక్‌ ‌మళ్లింపు చేపట్టినట్లు వెల్లడించారు. మరోవైపు విద్యుత్‌దీప కాంతులతో వారసత్వ సంపద ధగధగలాడుతున్నది.

Leave a Reply