Take a fresh look at your lifestyle.

విశాఖ మేయర్‌గా గొలగాని హరి వెంకటకుమారి

డిప్యూటీ మేయర్‌గా జియ్యాని శ్రీధర్‌

9 ఏళ్ల తర్వాత గ్రేటర్‌ ‌విశాఖ పాలకమండలి కొలువుదీరింది. విశాఖ మేయర్‌గా గొలగాని హరి వెంకటకుమారి, డిప్యూటీ మేయర్‌గా జియ్యాని శ్రీధర్‌ ఎన్నికయ్యారు. విశాఖ మేయర్‌ ‌పదవి దక్కకపోవడంపై నగర వైసీపీ అధ్యక్షుడు, కార్పొరేటర్‌ ‌వంశీ కృష్ణ శ్రీనివాస్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు కార్పొరేటర్‌గా అవకాశం ఇచ్చిన తన వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. తానొక దురదృష్టవంతుడిని అంటూ వంశీ భావోద్వెగానికి లోనయ్యారు. కొన్ని దుష్ట శక్తులు తనను అడ్డుకున్నాయని ఆరోపించారు. తాను ఒక సామాన్య కార్యకర్తగా ఉంటానని చెబుతూ…నిరసన చేసిన అభిమానులను వంశీ కృష్ణ శ్రీనివాస్‌ ఓదార్చారు.

వంశీకి మేయర్‌ ‌పదవి ఇవ్వకపోవడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన వర్గీయులు జీవీఎంసీ ఔట్‌ ‌గేట్‌ ‌వద్ద ఆందోళనకు దిగారు. కొందరు మహిళలు కంటతడిపెట్టుకున్నారు. సీఎం జగన్‌, ఎం‌పీ విజయసాయి రెడ్డికి వ్యతిరేకంగా వంశీ అనుచరులు నినాదాలు చేశారు. మేయర్‌ ‌పదవిపై చాలా ఆశలు పెట్టుకున్నా.. ఆ పదవి దక్కపోవడంతో నగర వైసీపీ అధ్యక్షుడు, కార్పొరేటర్‌ ‌వంశీ కృష్ణ శ్రీనివాస్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు కార్పొరేటర్‌గా అవకాశం ఇచ్చిన తన వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. తాను ఒక సామాన్య కార్యకర్తగా ఉంటానని చెబుతూ.. నిరసనగళం వినిపించారు. అక్కడే ఉన్న అభిమానులను వంశీ కృష్ణ శ్రీనివాస్‌ ఓదార్చారు.

వంశీకి మేయర్‌ ‌పదవి ఇవ్వకపోవడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన వర్గీయులు జీవీఎంసీ ఔట్‌ ‌గేట్‌ ‌వద్ద ఆందోళనకు దిగారు. కొందరు మహిళలు కంటతడి పెట్టుకున్నారు. సీఎం జగన్‌, ఎం‌పీ విజయసాయి రెడ్డికి వ్యతిరేకంగా వంశీ అనుచరులు నినాదాలు చేశారు.మొదట కేవలం నిరసన గళం వినిపించి ఊరుకున్న ఆయన.. తరువాత పరిణామాల క్రమంలో వైసీపీ నగర అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వైసీపీ నగర అధ్యక్ష పదవికి వంశీ కృష్ణ శ్రీనివాస్‌ ‌రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.

తనకు మేయర్‌ ‌పదవి దక్కకపోవడంతో మనస్తాపానికి గురైన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. వైసీపీలోని కొన్ని శక్తులు తనకు అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు. సీఎం జగన్‌ను కలుస్తానని వంశీకృష్ణ వెల్లడించారు. మేయర్‌ ‌పదవి ఇస్తానంటేనే తాను కార్పొరేటర్‌గా పోటీ చేశానని.. కానీ ఇప్పుడు మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply