Take a fresh look at your lifestyle.

కేంద్రంపై మరోసారి యుద్దానికి పోవాలే

  • రైతాంగం సంఘటిత శక్తిగా  రైతు వేదికలు
  • రైతు భూమికి సంపూర్ణ రక్షణ కల్పించేందుకే నూతన రెవిన్యూ చట్టం
  • నేను  ‌బతికి ఉన్నంత కాలం రైతు బంధు  ఆగదు
  • కొడకండ్లలో చేనేత పరిశ్రమ స్థాపన
  • రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు

తెలంగాణ రైతాంగం పండించిన ప్రతి పంటకు రైతులే ధరలు నిర్ణయించుకొని విక్రయించేంలా చైతన్య పర్చి రైతులు సంఘటిత శక్తిగా ఎదిలా చేసేందుకే తెలంగాణ ప్రభుత్వం రైతుల వేధికలను చేపట్టిందని, రైతు తన వ్యవసాయ భూమికి సంపూర్ణ రక్షణ కల్పించేందుకే నూతన రెవిన్యూ చట్టాన్ని తీసుకువచ్చినట్లు, తెలంగాణ రైతులు అప్పులు తీర్చి తమ బ్యాంకు కాతాల్లో డబ్బులు దాచుకేలా చేసినప్పుడే బంగారు తెలంగాణ వచ్చినట్లని, కేసీఆర్‌ ‌బతికి ఉన్నంత కాలం పాస్‌బుక్‌ ఉన్న ప్రతి రైతుకు రైతు బందు డబ్బులు ఇస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఉద్ఘాటించారు. శనివారం జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో అత్యంత సుందరంగా నిర్మించిన రైతువేధికను, పల్లే ప్రగతి పకృతి వనంను పంచాయతీరాజ్‌ ‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, శిశుసంక్షేమ మంత్రి సత్యవతిరాధోడ్‌, ‌వ్యవసాయ, మార్కెట్‌ ‌శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, సమన్వయ సమితి రాష్ట్ర అద్యక్షుడు పల్లే రాజేశ్వర్‌రడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆధ్వర్యంలో స్థానిక నాయకుల ఎడ్ల బండ్లతో ఘన స్వాగతం పలికారు. బ్రహ్మనోత్తములచే పూర్ణకుంబంతో, రైతుల హర్షద్వానాలతో ఘనంగా స్వాగతం పలికారు.

అనంతరం సీఎం కేసీఆర్‌ ‌కొడకండ్లలోని రైతు వేధికను, పల్లే ప్రకృతి వనాన్ని ప్రారంభించారు. అనంతరం పంచాయతీరాజ్‌ ‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అద్యక్షతన కొడకండ్ల మార్కెట్‌ ‌యార్డులో ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం అత్మీయ రైతు సమ్మెళనంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. దేశంలోనే మొట్టమొదటి సారిగా రైతు వేధికలు నిర్మించింది తెలంగాణ ఒక్కేటేనన్నారు. కొడకండ్లలో మరో కొత్త చరిత్రకు నాంది పలికామన్నారు. రాష్ట్రంలోని రైతాంగాన్ని సంఘటిత పర్చి ఏపంటలు వేస్తే ఎక్కువ డిమాండ్‌ ఉం‌టుందని తెలుసుకొని సాగు చేసేలా చైతన్య పర్చేందుకే రైతు వేధికలన్నారు. రాష్ట్రంలో క్లష్టర్ల వారిగా 2601రైతు వేధికలను రూ, 600వందల కొట్లతో నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో గ్రామాల్లో తిరిగినప్పుడు రైతు బాధలను, ఉరితాళ్లకు వేలాడిన రైతు శవాలను చూసి చలించిపోయానన్నారు. అప్పుడే నిర్ణయించుకున్న తెలంగాణ సాధించాలి రైతులను అర్థికంగా అభివృద్ది చేయాలని, గత ప్రభుత్వాలు రైతులను పట్టించుకొలేదు. రైతు బతుకంతా ఆగమాగం జగనాథంగా ఉండేది. తెలంగాణ వస్తే కరెంటు రాదు, సాగునీరు రాదు పరిపాలన అస్తవ్యస్థంగా మారుతుందని గత పాలకులు ఎద్దేవా చేశారు.

కాని తెలంగాణ సాధించుకున్నాక అనే సాగునీటి ప్రాజెక్టులను నిర్మించుకున్నామన్నారు. గోదవరి జలాలతో ప్రతి చెరువును కాలువల ద్వార నింపి ప్రతి ఒకరానికి సాగునీరు ఇవ్వగలుగుతున్నామన్నారు. ఈ ఏడిది తెలంగాణలో 53 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగలిగామన్నారు. వచ్చే రెండేళ్లలో తెలంగాణలో కోటి ఎకరాల మాగాణీగా చేయడమే లక్ష్యంగా ముందుకు పోతున్నామన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వ మద్దతు ధరను ఇచ్చి కొనుగోలు చేస్తుందన్నారు. దేశంలోనే ఏరాష్ట్రంలో ఈవిధంగా కొనుగోలు చేయడం లేదన్నారు. తెలంగాణ రైతాంగానికి ఇబ్బందులు ఉండవద్దని ఏ గ్రామ రైతులు ఆగ్రామంలోనే పండించిన పంటను విక్రయించుకునేలా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రైతులను సన్న దాన్యం పండించాలని ఖరిఫ్‌ ‌సీజన్‌కు ముందు నేనే చేప్పాను, ఇప్పుడు ధరలేదని మీరు బాధపడవద్దు, కేసీఆర్‌ ‌చెప్పి ఇంట్లో పడుకొడు సన్నదాన్యానికి వందో నూటయాబైయో ఎక్కువ వచ్చేందుకు ప్రతిపాధనలు చేపడుతున్నాం. సన్నధాన్యానికి ధర తగ్గేందుకు కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన బిల్లేనని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కొంత ఎక్కువ ఇచ్చి కొనుగోలు చేద్దామంటే కేంద్రం అడ్డుపడుతుందన్నారు. కాంగ్రెస్‌ ‌పాలనలో ఓ మాజీ మంత్రి ఒకయాన తన పొలంలోని పంటను కోసుకొని గడ్డిని కాల్చీ సన్నరకానికి ధర రాక కాల్చుతున్నామని దొంగ నాటకం వేస్తు రైతులను మోసం చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు.

దేశ రైతాంగానికి కొపం వచ్చి వ్యవసాయాన్ని మానేస్తే దేశప్రజలకు తిండి పెట్టే శక్తి ఏదేశానికి లేదని గతంలోనే ప్రదానికి చెప్పానన్నారు. రైతాంగం సంఘటితమై కేంద్రంపై మరోసారి యుద్దానికి పోవాలేన్నారు. కేంద్రం తెచ్చిన బిల్లుతో కార్పోరెట్‌ ‌గద్దలే ఎక్కడ పడితే అక్కడ కొనుగోలు చేస్తాయని విమర్శించారు. ప్రతిపల్లేలో ప్రతి ఇంటికి నల్లా ద్వార తాగునీరు ఇస్తామని మిషన్‌ ‌భగీరథ ద్వార ఇస్తున్నామని తెలిపారు. తెలంగాణ విమర్శించిన గత పాలకులకు చెంపపెట్టులాగ అభివృద్ధి చేసుకుంటు పోతున్నామన్నారు. దేశంలో ఏరాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో 24గంటల ఉచిత విద్యుత్తును నిరంతరాయంగా ఇస్తున్నమన్నారు. తెలంగాణ ప్రజలు ఎవ్వరు కోరకపోయినా నా ప్రజలు సుభిక్షంగా సుఖ సంతోషాలతో జీవించినప్పుడే బంగారు తెలంగాణ వచ్చినట్లని రైతు బందు, రైతు బీమా, మిషన్‌ ‌కాకతీయ, మిషన్‌ ‌భగీరథ, పించిన్లు, కళ్యాణ)క్ష్మీ వంటి పథకాలను తీసుకువచ్చి అమలు చేస్తున్నామన్నారు. కొంతమంది కిరికిరిగాల్లు మద్యలో అడ్డుతగులుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపీ నాయకులు పించిన్లు మేము ఇస్తున్నామని అబద్దాలు చెబుతున్నారు.

రాష్ట్రంలో 38.64లక్షల మందికి 2016రూపాయల చోప్పున 11వేల కోట్ల ఇస్తున్నామన్నారు. కేంద్రం కేవలం 7లక్షల మందికి రూ,200రూపాయల చోప్పున 105కోట్లు మాత్రమే ఇస్తున్నారు. దీనికి ఇన్ని అ•ద్దాలు చెబుతారని విమర్శించారు. నేను చెప్పింది అబద్దమైతే సీఎంగా రాజీనామా చేస్తానని సవాలు చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు ఓట్ల రాజకీయాలు చేస్తున్నాయని ఎద్దేవచేశారు. రైతులు సంఘటితంగా ఉన్నప్పుడే ప్రభుత్వాలు దిగివస్తాయన్నారు. అప్పుడే రైతు కోరుకున్న మద్దతు దర వస్తుందన్నారు. గతంలో ఎప్పుడో నైజాం పాలనలో భూములను కొలతలు వేశారు. ఇప్పుడు మన తెలంగాణలో అక్షాంశాలు రేఖాంశాల ద్వారా కొలతలు వేసేందుకు సన్నాహలు చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరు దగ్గరుండి కొలిపించుకోవాలన్నారు. దరణీ పోర్టల్‌ ‌ద్వారా భూమికి రక్షణ వస్తుందన్నారు.

ఎవ్వరు మార్చేందుకు వీలు లేకుండా చేశామన్నారు. గతంలో మాదిరిగా జామీందారులు, జాగీర్ధారులు ఉండరన్నారు. ఎవ్వరిని బతిమాలాడాల్సీన పని లేదన్నారు. రాష్ట్ర వీఆర్‌వోలపై నాకు వ్యక్తిగతం కోపం లేదన్నారు. కొడకండ్లలో నిర్మించిన రైతు వేధికను, పల్లే ప్రగతి పకృతి వనంనూ చూసి అనందంగా ఉందన్నారు. అందకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కృషి ఎంతో ఉందని ఎర్రబెల్లిని అభినందించారు. రైతులు మక్కలను సాగు చేయకుండా కందులు, ఫాం అయిల్‌, ‌శనిగ, పప్పుదాన్యాలను పండించేలాని సూచించారు. అందుకు రైతు సమితుల సభ్యులంతా రైతాంగాన్ని చైతన్య పర్చాలని కోరారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరిక మేరకు కొడకండ్లలో చేనేత పరిశ్రమను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సీఎస్‌ ‌సోమేష్‌కుమార్‌, ‌మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యే నెమురుగొమ్ముల సుధాకర్‌రావు, జిల్లా చైర్మన్లు, సమన్వయ సమితి అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, వివద స్థాయిల పార్టీ నాయకులు,వ్యవసాయశాఖ కమీషన్‌ ‌జనార్దన్‌రెడ్డి, జనగామ జిల్లా కలెక్టర్‌ ‌నిఖిల, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply