తెలంగాణ రాష్ట్రం అనుసరిస్తున్న విధానాలే మహాత్మా జ్యోతిరావు పూలేకు నిజమైన నివాళి అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. అంటరానితనం, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా జీవితాంతం అలుపెరగని పోరాటం చేసిన సంఘ సంస్కర్త, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, మహిళా విద్యాభివృద్ధికి కృషిచేసిన స్ఫూర్తి ప్రదాత మహాత్మా జ్యోతిరావు పూలే అని అన్నారు. ఆయన జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ పూలేకు ఘన నివాళులర్పించారు. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన్ను స్మరించుకోవడం అదృష్టమిన సీఎం అన్నారు. ఎన్నో సామాజిక సంస్కరణలకు జ్యోతిరావు పూలే నాంది పలికారన్నారు. సమసమాజ స్థాపనకై పూలే అహర్నిశలు కృషి చేసినట్లు తెలిపారు. కుల, లింగ వివక్షతకు వ్యతిరేకంగా పోరాడారన్నారు. అందరికీ విద్యనందించాలని ఉద్యమం చేపట్టి పూలే ఆదర్శంగా నిలిచినట్లు సీఎం పేర్కొన్నారు.