Take a fresh look at your lifestyle.

కొరోనా +ve

ఓ ‌మనిషి!!
విర్రవీగావుగా!
కనపడని
సూక్ష్మ జీవికే
కలవరపడి పోతున్నావే..
ఏమైంది
నీ అహం!!
కరోనా దెబ్బకు
కకావికలమయ్యావే!!
ప్రకృతిని శాసిస్తానని
వికటాట్టహాసము చేసావే!
అగుపించని రేణువుకు
అహాకారాలు చేస్తున్నారే!!
వేరే జీవికి ఈ జగతిన
చోటే లేకుండా
వెర్రి వేషాలు వేశావే!!
కుక్కను తినేవాడొకడు..
నక్కను తినేవాడొకడు..
పిల్లిని తినేవాడింకొకడు
బల్లి తినే బద్మాసిగాడొకడు!!
పురుగును తినేవాడొకడు
పుడమిని చీల్చేవాడొకడు..
చరాచర జీవాలతో
సరాసరిగా జీవించాలని
రమారమిగా ఈ ధాత్రిపై
జన్మింపజేసిన జన్మదాతకు
వాతలు పెడితివి కదరా!!
ప్రకృతి వినాశనానికి
వికృత చేష్టలు జేస్తివి.!
అధర్మం ప్రబలడమంటే
ఇతర జీవుల సంహారం కాదా?
ప్రకృతి వనరుల విధ్వంసం కాదా?
పర్యావరణానికి ముప్పు కల్గించడం కాదా?
పంచభూతములను పరిహాసించడం కాదా?
అధర్మం ప్రబలినపుడు
సాధు జీవుల రక్షణకై
తదాత్మానాం
సృజామ్యహమ్‌!!!
అన్నాడుగా
భగవంతుడు గీతలో.!
కరోనా సూక్ష్మ జీవి రూపంలో
తనకు తానుగా
సృష్టించుకున్నాడేమో
దేముడు?
మనిషి వీపరీత
పోకడలను
కట్టడి చేస్తున్నాడేమో?
ప్రకృతితో మమేకమై
ప్రగతిపొందుమని
పాటుపడుతున్నాడేమో?
పంచభూతములను
వంచన చేస్తున్నందుకు
కొంచెం కోపిస్తున్నాడేమో?
సాధు జీవుల రక్షణకు
కొద్దిపాటి సంహారం సహజమేగా..
అల్పజీవం గల
ఓ నరుడా..!
గారడి చేస్తానంటివి..
ఆద్యంతం లేని
కాలాతీత ప్రకృతిని
శాసిస్తానంటివి.!
యాచకుడవై
బ్రతుకు కొరకు
బ్రతిమాలాడుతుంటివి
చేసిన పాపం ఊరికే పోదు.!
ఇకనైనా..
పద్ధతి మార్చుకొని
బుద్దిగా వుండు
సర్వ ప్రాణి సేవే
మాధవ సేవగా
జీవనం సాగించు…!!
నువ్వు ఆహ్వానిస్తేనే
నిన్ను ఆక్రమిస్తుంది
కరోనా…
ఆదమరిచావో
నీ కుటుంబాన్ని
కబలించేస్తుంది.
సమాజాన్ని  కూడా
ఛిద్రం చేస్తుంది..
సామాజిక దూరం పాటించు..
కరోనా సమస్యను పరిష్కరించు…
చేతులు తరుచుగా కడుక్కో…
వైరస్‌ను వదిలించుకో..
శుభ్రత పెంచుకో..
భద్రత నిలుపుకో…
మందు వద్దు,
మాకు వద్దు..
తొందరగనే కరోనా మటుమాయం..
కరోనా మహమ్మారి కాదు,
నిన్ను దారిలో పెట్టడానికి వచ్చిన అమ్మోరు..
కన్పించక పోతుంది కరోనా.
మంచి బుద్ధి నింపుకుంటే నరనరానా..

devunuri srinivas
దేవునూరి శ్రీనివాస్‌,
మోటార్‌ ‌వెహికిల్‌ ఇన్స్‌పెక్టర్‌,
కరీంనగర్‌

Leave a Reply