వేదిక మీద వక్తలు
వేదిక ముందు వ్యక్తులు
గల గలలతో నిండు ముందుగా
సభావేదిక
సమావేశాలకు ఎదురుచూపులే
మహా వేడుక!
వ్యక్తుల ముందు వక్తల నివేదిక
తీర్పరుల ముందు నేర్పరుల కోరిక
వక్తల కు ఉపన్యాసాలు పరీక్షలు
వ్యక్తులు వక్తల పరీక్షకులు!
ప్రేక్షకుల చప్పట్లు
ప్రసంగాల పరుగుకు పచ్చ జెండాలు!
భగవంతునికి భక్తునికి
అనుసంధానమైనది ‘భక్తీ’
వక్తలకు వ్యక్తులకు మధ్య
వరాల హామీ లే కష్టాల విముక్తి!
వక్తల ప్రసంగాలకు ప్రభావితమైతే,
ప్రసన్నులైతే కోరిన కోర్కెలు తీర్చే వాళ్ళు
వాళ్ళు దేవుళ్ళే !
సిరికింజెప్పడు అన్నట్లు
వారి వ్యవహారాలను పక్కన పెట్టి
వక్తలపై అపేక్షతో వచ్చినవాళ్లు
వాల్లు మాట్లాడరు
వాళ్ళు ఆశీర్వదిస్తే
అదృష్టం వరిస్తుంది
వారు ప్రేక్షక దేవుళ్ళు!
పి.బక్కారెడ్డీ
9705315250