Take a fresh look at your lifestyle.

గోదావరి జలాలు వృథా పోరాదు

Godavari waters should not be wasted Cm Kcr1

  • ఎప్పటికప్పుడు నీళ్ళుతోడాలి
  • చివరి ఆయకట్టు వరకు సాగునీరివ్వాలి
  • కాళేశ్వరం ఇంజనీరింగ్‌ అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశం

గోదావరి జలాలు వృథాగా పోకుండా చూడాల్సిన బాధ్యత ఇంజినీర్లదేనని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. చివరి ఆయకట్టు వరకు నీరందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాళేశ్వరం సందర్శనలో భాగంగా గురువారం లక్ష్మీ బ్యారేజ్‌ ‌ద నుంచి నాణాలు వదిలి మొక్కులు చెల్లించుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్‌.. ‌వ్యూ పాయింట్‌ ‌వద్ద ఇంజనీరింగ్‌ అధికారులకు పలు సూచనలు చేశారు.రాబోయే వర్షాకాలం వరద నీరు ఉదృతంగా చేరు తుందని, ఈ నేపధ్యంలో లక్ష్మి బ్యారేజ్‌ ‌నుంచి ఎప్పటికప్పుడు నీటిని తోడు కోవాలని, అందుకు సంబంధించిన వ్యవస్థను సిద్ధం చేసుకోవాలని ఇఎన్సిలు మురళీధర్‌ ‌రావు, నల్ల వెంకటేశ్వర్లు,ఓఎస్డీ శ్రీధర్‌దేశ్‌పాండే సహా అక్కడ హాజరైన పలువురు ఇంజనీర్లకు ఉన్నతాధికారులకు సూచించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా పనిచేసి ఇటీవల ఇరిగేసన్‌ ‌శాఖ ప్రిన్సిపల్‌ ‌సెక్రెటరీ గా నూతన బాధ్యతలు స్వీకరించిన రజత్‌ ‌కుమార్‌ ‌కు సంభందిత విషయాల పట్ల అవగాహన పెరిగే విధంగా ప్రాజెక్టు నిర్మాణము సాగునీటి వినియోగం ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. ఎంతో కష్టపడి కట్టుకున్న ప్రాజెక్టులలోని నీటిని ఎప్పటికప్పుడు తోడి పోసుకుంటూ రిజర్వాయర్లను నింపుతూ… గోదావరి జలాలు వృథా పోకుండా చుస్కోవల్సిన బాధ్యత ఇంజనీర్లదే నన్నారు. ఎస్సారెస్పి నుంచి మొదలుకుని మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజి లను రిజర్వాయర్‌ ‌లను ఎత్తిపోతల పంపులను కాల్వలను చివరాఖరికి ఆయకట్టు దాకా సాగునీరు వ్యవసాయ భూములను తడిపే చివరి జల ప్రయానం దాకా సునిశిత పర్యవేక్షణ చేసుకోవాలన్నారు.

ఎక్కడికక్కడ పని విభజన చేసుకుని పూర్తిస్థాయిలో ఇంజినీరింగ్‌ ‌వ్యవస్థను పటిష్ట పరుచుకుని అవసరమైతే పోలీసుల మాదిరి వైర్‌లెస్‌ ‌వాకీటాకీ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని పని చేయాలని చెప్పారు. సమాచారాన్ని ప్రతిక్షణం చేరవేసుకుంటూ ఎప్పుడు ఏ మోటార్‌ ‌నడుస్తుంది, ఏ పంపు పోస్తుంది… ఎన్ని నీల్లు ఎత్తాలే, ఎప్పుడు ఆపాలే ఎప్పుడు నీటిని కిందికి వదులాలే వంటి పలు విధాలైన నీటి పంపిణీ సాంకేతిక అంశాల పట్ల కాళేశ్వరం టీం మొత్తానికి అవగాహన ఉండాలి అన్నారు. అట్లా సమన్వయంతో పనిచేసి గోదావరి జలాలను నూటికి నూరుశాతం సద్వినియోగ పరుచు కొగలమని సీఎం స్పష్టం చేశారు. అందుకు సంబంధించి చర్యలు చేపట్ట నున్నట్టు వివరించిన సీఎం మెదిగడ్డ వద్ద మధ్యాహ్నం భోజనం చేసి కరీంనగర్‌ ‌బయలు దేరారు.

ఒకే గొడుగు కిందికి ఇంజనీరింగ్‌, ఇరిగేషన్‌

లక్ష్యాల సాధనకు విభాగాల పునర్వ్యవస్థీకరణ: సీఎం
Godavari waters should not be wasted Cm Kcr1

రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా సాగునీటి లక్ష్యాల సాధనకు ఇరిగేషన్‌, ఇం‌జనీరింగ్‌ ‌విభాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకు రానున్నట్లు సీఎం కేసీఆర్‌ ‌వెల్లడించారు. సాగునీటి ఇంజనీరింగ్‌ ‌వ్యవస్థను 11 సర్కిళ్లుగా విభజించి సర్కిల్‌ అధిపతిగా చీఫ్‌ ఇం‌జనీర్‌ను నియమించనున్నట్లు తెలిపారు. మే నెలాఖరులోగా రాష్ట్రంలోని అన్ని సాగునీటి కాల్వల ఆధునీకరణకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. జూన్‌నెలాఖరులోగా ఇరిగేషన్‌, ఇం‌జనీరింగ్‌ ‌విభాగాల్లో ఉన్న అన్ని ఖాళీలను భర్తీ చేసే దిశగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని చెరువులను నింపేలా కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. కరీంనగర్‌, ‌నిజామాబాద్‌ ‌జిల్లా కేంద్రాలలో ప్రస్తుతం ఉన్న కలెక్టర్లే స్థానంలో వెంటనే కొత్త కలెక్టరేట్ల నిర్మాణాన్ని ప్రారంభించాలసి సీఎస్‌ ‌సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. 530 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తిపోసే విధంగా ఇరిగేషన్‌ ‌శాఖ అధికారులు అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. గురువారం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం కరీంనగర్‌ ‌జిల్లా కలెక్టరేట్‌లో మంత్రులతో పాటు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. సాగునీటి రంగంపై అధికారులకు నిర్ణయించిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రాజెక్టుల నిర్వహణ, నీటి సరఫరాపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఏప్రిల్‌ ‌నెలాఖరు లోగా ఇరిగేషన్‌ అధికారులు సిబ్బంది నివాసానికి సంబంధించిన క్వార్టర్లను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని చెరువులను నింపేలా కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. గోదావరి జలాలను సద్వినియోగం చేసుకునేలా బ్యారేజ్‌ల ఆపరేషన్‌ ‌రూల్స్ ‌కార్యాచరణను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సాగునీటి కాల్వలకు మే నెలాఖరులోగా అవసరమైన అన్ని మరమ్మత్తులు చేపట్టాలని సూచించారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!