Take a fresh look at your lifestyle.

కూడవెల్లి వాగులోకి గోదావరి జలాలు

విడుదల చేసిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు
కూడవెల్లి వాగు కొత్త దశ,దిశా చూపి పునర్జన్మ ను ప్రసాదించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దేననీ .. కాళేశ్వరం ప్రాజెక్ట్ తో గుక్కెడు మంచి నీళ్ళ కోసం తల్లడిల్లిన ప్రాంతం. మం డు టెండల్లో జలకళ ను సంతరించుకుంది అని మంత్రి హరీష్ రావు ఆనడం వ్యక్తం చేశారు.

కూడవెల్లి వాగులోకి మంగళవారం గోదావరి జలాలు విడుదల చేసిన సందర్బంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ ..100 మీటర్ల నుంచి 600 మీటర్ల ఎత్తుకు గోదారమ్మ ను తీసుకువచ్చి కూడవెల్లి వాగు కు జీవ జలకళ తెచ్చాం..

కూడవెల్లి వాగు లో గోదావరి జలాల విడుదల తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించి దగిన రోజు.. కూడవెల్లి వాగు లో గోదావరి జలాల విడుదలలో వెయ్యి ఓల్ట్ ల బల్బు వేస్తే వచ్చే వెలుగు రైతుల కళ్ళలో కనబడుతుందనీ ..మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ పనులు ప్రారంభించిన రోజు హేళన చేసిన వ్యక్తులు ప్రస్తుత ఫలితాలు చూసి ఈర్ష్య పడుతున్నారు..

కూడవెల్లి వాగు లో గోదావరి జలాల విడుదలతో వేసవి కాలంలో లక్షల రూపాయల విలువైన పంటను కాపాడు కోగలిగాం.. తెలంగాణ రైతులు మొఖాన్ని మొగులు దిక్కు చూడాల్సిన అవసరం లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తో వర్షం కోసం ఎదురు చూపులు చూసే పరిస్థితి లేకుండా చూసాం.. స్వరాష్ట్రం సాధించుకున్నందువల్లే ..సాగు, త్రాగునీటి బాధలకు శాశ్వత పరిష్కారం చూపగలిగాం.. ప్రతి పక్షాల విమర్శలకు మా పని తీరుతోనే సమాధానం చెబుతున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు.

Godavari waters into the Koodavelli estuary harees rao

Leave a Reply