Take a fresh look at your lifestyle.

‌భద్రాద్రి వద్ద పెరుగుతున్న గోదావరి

అల్పపీడన ప్రభావంతో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతుంది. గురువారం సాయంత్రం 35.9 అడుగులు గోదావరి శుక్రవారం సాయంత్రానికి 40 అడుగులకు చేరుకుంది. ఉదయం 10 గంటలకు 43 అడుగులకు చేరుతుందని, దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉన్నట్లు అధికారుల తులిపారు.ఇది క్రమంగా పెరిగే అవకాశం ఉన్నట్లు నీటి పారుదలశాఖ అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో భారీగా వరద నీరు వస్తుండటంతో భద్రాచలం వద్ద గోదావరి పరవళ్ళు తొక్కుతుంది. తాలిపేరు ప్రాజెక్టులో కూడ నీటి నిల్వ ఎక్కువగా ఉండటం వలన నీటిని కింది భాగానికి విడుదల చేస్తున్నారు. ఇంద్రావతి , ప్రాణహిత, నదులు పొంగుడుంటంతో క్రింది భాగానికి నీటిని విడుదల చేస్తున్నారు.

దీని కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మొదటి ప్రమాద హెచ్చరికకు చేరుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటికే విలీన మండలాలు వాగులు, వంకలతో, రహదారులు, స్థంభించిపోయాయి. ముందు జాగ్రత్తగా చర్యగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు జిల్లా అధికార యంత్రాంగం సిద్దంగా ఉంది. వరదల ప్రబావంతతో ఇటువంటి అంటువ్యాధులు ప్రబల కుండా ఉండే విధంగా వైద్యాధికారులు తగు చర్యలు తీఃసుకోవాలన ఐటిడిఏ పిఓ గౌతమ్‌ ‌పొట్రూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసారు. గిరిజన ప్రాంతాల మారుమూల గిరిజనుల పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని కోరారు. ఆరోగ్యం పట్ల ఎటువంటి ఇబ్బందులు ఉన్న భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించాలని ఆదేశాలు జారీ చేసారు. గోదావరి వరదలను ఎదుర్కునేందుకు అధికార యంత్రాంగం సిద్దంగా ఉంది.

Leave a Reply