Take a fresh look at your lifestyle.

భదాద్రి వద్ద తగ్గిన గోదావరి

మొదటి, రెండవ ప్రమాద హెచ్చరికలు ఉపసంహరించుకున్న అధికారులు
జూరాలకు భారీగా వరదనీరు

ప్రజాతంత్ర, భద్రాచలం/మహబూబ్‌నగర్‌ : ‌శనివారం సాయంత్రానికి 48 అడుగులకు చేరుకున్న గోదావరి నీటిమట్టం.ఆదివారం నుండి క్రమక్రమంగా తగ్గుతూ సోమవారం సాయంత్రానికి 31 అడుగులకు తగ్గింది. దీంతో అధికారులు మొదటి, రెండవ ప్రమాద హెచ్చరికలను ఉపసంహరించుకున్నారు. గోదావరి తగ్గుముఖం పట్టినప్పటికీ బురదతో ఉన్నందున్న సుమారు 130 మంది పునరావాస కేంద్రంలోనే ఉన్నారు. వర్షాల నేపథ్యంలో విష జ్వరాలు ప్రబలే పరిస్థితులు అధికంగా ఉంటాయి కాబట్టి, మలేరియా, డెంగ్యూ, ఇతర విష జ్వరాలు రాకుండా చర్యలు తీసుకోవలన్నారు. ఒకవేళ ఎవరైనా తీవ్ర జ్వరంతో బాధపడితే అది విస్తరించక ముందే వారిని గుర్తించి తక్షణమే వైద్యం అందించాలని కలెక్టర్‌ అనుదీప్‌ ఆదేశాలు జారీ చేసారు.

జూరాలకు భారీగా వరదనీరు
జూరాల ప్రాజెక్ట్‌కు భారీగా వరద వొస్తున్నది. ఎగువన భారీ వర్షాలతో జలాశయంలోకి 3,86,000 క్యూసెక్కుల నీరు వొచ్చిచేరుతున్నది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 44 ‌గేట్లు ఎత్తి 4,02,463 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం వైపు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 వి•టర్లు. ప్రాజెక్టులో ప్రస్తుతం 316.550 వి•టర్ల నీటిమట్టం ఉన్నది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలకు గాను ప్రస్తుతం 6.01 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. కృష్ణా బేసిన్‌లోని జలాశయాలకు వరద కొనసాగుతున్నది. ఎగువ ప్రాంతాలతో పాటు, నది పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వరద వొచ్చి చేరుతుంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 868 అడుగులుగా ఉంది. శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్‌ ‌కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతున్నది. నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్‌ ‌ప్రాజెక్టుకు 31,784 క్యూసెక్కులు వరద వొస్తుండగా.. వెయ్యి క్యూసెక్కులు ఔవుట్‌ ‌ఫ్లో ఉన్నది.

Leave a Reply