మూడవ ప్రమాద హెచ్చరిక జారీ
ప్రమాద•స్థాయిని మించి ప్రవహిస్తున్న వరద నీరు
పునరావాస కేంద్రాలు ఏర్పాటు – వేలాది ఎకరాల్లో పంట మునక
అల్పపీడనం ప్రభావంతో ఛత్తీస్‌ఘడ్,మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలలో భారీగా కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరుకుంది. ఎగువప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకు వరదనీరు భారీగా భద్రాచలం చేరుకుంటుంది. ఆదివారం సాయంత్రానికి భద్రాచలం వద్ద 53 అడుగులకు చేరుకుంది.దీంతో అధికారులు మూడవ ప్రమాద హెచ్చరికను జారీచేసారు. ఆదివారం ఉదయం నుండి భారీగా వరద నీరు భద్రాచలం చేరుకుంటుంది. సోమవారం సాయంత్రానికి 61.7 అడుగలకు చేరుకుని ప్రమాద స్థాయికి చేరుకుంది. దీంతో ప్రజల్లో తీవ్రభయందోళనలు నెలకొన్నాయి. కాళేశ్వరం, ఇంద్రావతి పేరూరు నుండి నీటిని క్రిందికి విడుదల చేయడంతో ఆదివారం నుండి గోదావరి వరద వేగంగా పెరుగుతుంది. ఇప్పటికే 35 గ్రామాలు జలధిగ్భందంలో ఉన్నాయి. భద్రాచలం డివిజన్లలో, మండలాలలో ప్రజలకోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేసారు. ముంపుకు గురయిన ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. భద్రాచలం పట్టణంలోని కొత్తకాలనీ, రెవిన్యూకాలనీ, సుభాష్‌నగర్ కాలనీలలోకి వరదనీరు చేరుకుంది. బూర్గంపాడు మండలంలోని గ్రామాలు వరద నీటిలోనే ఉన్నాయి. అంతేకాకుండా మణుగూరు, పినపాక మండలాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. కరకగూడెం మండలంలో వరదనీటిలోనే గ్రామాలు ఉన్నాయి. వాజేడు మండంలంలో చండ్రపట్ల, అయ్యవారిపేట, ఆర్లగూడెం, చింతూరు, నాగారం, వెంకటాపురం మండంలంలో దానవాయిపేట,వడ్డిగూడెం, ఉప్పేడు, తనిపర్తి, ఉప్పేడువీరాపురం, కోయబెస్తగూడెం, చర్ల మండంలోని దండుపేట, తేగడ, దుమ్ముగూడెం మండలంలోని ఎల్న్రావుపేట, ప్రగళ్ళపల్లి, కాశీనగరం, ఎస్.కొత్త గూడెం, కన్నాపురం, గంగోలు, కె.రేగుపల్లి, తూరుబాక, రేగుపల్లి, బైరాగులపాడు, ఆంధ్రాలో విలీనం అయిన మండలాలు చింతూరు మండలంలోని మురుమూరు, ముకునూరు, విఆర్‌పురం మండలంలోని వడ్డిగూడెంకాలనీ, వాడిగూడెం, రాజుపేట, చొప్పల గుమ్ము, రామవరం, ఎస్.రావుగూడం గ్రామాలు ఇప్పటికే వరదనీటిలో మునిగిఉన్నాయి. దీని కారణంగా భద్రాచలంకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
ఎటపాక వద్ద గోదావరి వరదనీరు రోడ్డుపైకి రావడంతో చర్ల, వెంకటాపురం, దుమ్ముగూడెం మండలాలకు పూర్తిగా రహదారి సౌకర్యం నిలిచిపోయింది. వెంకటాపురం మండలంలోని చీకుపల్లి వాగులోకి భారీగా వరదనీరు చేరుకోవడంతో సుమారు 32గ్రామాలు జలదిగ్బంధంలొ ఉన్నాయి. వారికోసం అధికారులు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. విలీన మండలం చింతూరు మండలంలోని చింతూరు మండలంకు 17గ్రామాలకు రాకపోకలు స్ధంబించాయి. చింతూరు మండంలం ముకునూరువద్ద సోకిలేరు నది పొంగిప్రవహించడంతో విఆర్‌పురం మండ లంతో పాటు చింతూరు మండం లలోని ముకునూరు,నర్సిం గపేట,పిఎస్పల్లి,జిఎస్పల్లి,
ప్రమా ధకర పరిస్ధితుల్లో వాగులు ఆయాగ్రామాల ప్రజలు దాటు తున్నారు.కూనవరం మండలంలో కూడా వరదపరిస్ధితి దారునంగా ఉంది.భద్రాచలంలోని గుండాల రోడ్డుపైకి నీరు రావడంతో ఆంధ్రాకు విలీనమైన మండలాలు కూనవరం,చింతూరు,విఆర్‌పురం మండలాలకు రహదారి సౌకర్యం పూర్తి స్ధంబించింది.అంతేకాకుండా భద్రాచలం వద్ద ఎటపాక గ్రామం వద్ద గోదావరి వరదనీరు రోడ్డుపైకి చేరుకోవడంతో వెంకటాపురం,చర్ల,దుమ్ముగూడం,మం