మరింత పెరిగే అవకాశం
భయాందోళనలో ప్రజలు
మూడవ ప్రమాద హెచ్చరిక జారీ
అల్పపీడనం ప్రభావంతో ఎగువప్రాంతాల్లో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో భద్రాద్రి కొత్తగూడెం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మళ్ళీ అతివేగంగా పెరుగుతుంది. మూడవ ప్రమాద• హెచ్చరిక వరకు పరవళ్ళు తొక్కిన గోదావరి బుధవారం సాయంత్రానికి శాంతించింది. మొదటి ప్రమాద• హెచ్చరికను కూడా ఉపసంహరించుకునే సమయంలో అర్దరాత్రి నుండి మళ్ళీ గోదావరి అతివేగంగా వస్తుంది. బుధవారం సాయంత్రం 43 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం అర్దరాత్రికి 42.4 అడుగులకు తగ్గింది. గురువారం ఉదయం 9 గంటలనుండి వేగంగా పెరుగుతుంది. గురువారం సాయంత్రంకు 53 అడుగులకు చేరుకుని మూడవ ప్రమాద• హెచ్చరికకు చేరుకుంది. భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అలాగే దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే భద్రాచలం నుండి విలీన మండలాలైన కూనవరం, విఆర్‌పురం, చింతూరు ప్రాంతాలకు పూర్తిగా రాకపోకలు స్థంభించిపోయాయి. మారుమూల గిరిజన గ్రామాలు వరదనీటితో మునిగిపోయాయి. శుక్రవారం ఉదయంకు సుమారుగా 60 అడుగులకు చేరుకునే అవకాశాలు కపబడుతున్నాయి.
ఇప్పటికే గంటగంటకు ఒక అడుగు చొప్పున వరద ఉదృతి పెరుగుతుంది. ఇది ఈ అర్ధరాత్రికి మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో అధికారులు మరింత ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. ఇది మరింత పెరిగి 63 అడుగులకు చేరుకునే అవకాశం ఉన్నది. గోదావరి నీటిమట్టం అతివేగంగా పెరుగుతంది. ఎస్ఆర్ఎస్పి, ఎల్లంపల్లి, పాతగూడెం, ప్రాణహిత, ఇంద్రావతి, పేరూరు, తాలిపేరు నుండి వరద ఉధృతి ఎక్కువుగా వస్తుండటంతో అధికారులు అంచనాలు వేయలేకపోతున్నారు. ఈసారి వరద ఉధృతి భారీగానే వచ్చే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాతాల ప్రజలు సురక్షిత ప్రాతాలకు తరలివెళ్ళాలని అధికారులు ఉత్తర్వూలు జారీ చేసారు. ఇప్పటికే గత నాలుగు రోజులుగా రెవిన్యూ, సుభాష్‌నగర్, కొత్తకాలనీ, రామాలయం చప్టాదిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. ఒక ప్రక్క భారీ వర్షాలు, గోదావరి వరదలకు లోతట్టు ప్రాంతాల ఇల్లు జలమయం అయ్యాయి. కరకగూడెం, పినపాక, మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు, భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల మండలాలలోని ఇళ్లు ఇంకా జలాల్లోనే ఉన్నాయి. ఆ ప్రాంత ప్రజలు పునరవాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. కొద్దిగా శాంతించిన గోదావరి మళ్ళీ అతివేగంగా రావడంతో ప్రజలు పునరావాసకేంద్రాల నుండి ఇంటికి వెళ్ళలేని పరిస్ధితి ఏర్పడింది. అధికారులకు ప్రజలు సహకరించాలని అధికారులు కోరుతున్నారు. ఇప్పటికే వరద ముంపుకు గురయ్యే బాధితులను సురక్షిత ప్రాతాలకు వెళుతున్నారు. జోనల్ అధికారుల బృందాలను, సెక్టోరియల్ అధికారులు, మోబైల్ టీంలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం అందిస్తున్నారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ యంవి రెడ్డి అధికారులకు తగిన సూచనలు ఇస్తున్నారు. ఎవరు కూడా వాగులు దాటవద్దని ఆదేశాలు జారీచేసారు. మరింత సమాచారం అందించేందుకు భద్రాచలం వద్ద కంట్రోల్ రూం ఏర్పాటు చేసారు. వివరాలకు 08744-241950, 08744-249994, 08743-232444 నెంబర్లకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వాల్సిందిగా అధికారులు కోరారు. లోతట్టు ప్రాతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. అంతేకాకుండా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని ఇప్పటికే ఉత్తర్వులు జారీచేసారు. చెరుకూరు, చింతూరు, పేరూరు, క్రిష్టాపురం, మండలాలు పూర్తిగా నీటమునిగాయి. రా••పోకలు బంద్ అయ్యాయి.ఎగువప్రాంతాలలో భారీగా కురుస్తున్న వర్షాలకు భారీగా వరదనీరు చేరుకుంటుంది. భద్రాచలం డివిజన్లో వరద ప్రభావం ఎక్కువుగా ఉంటుంది. చర్ల మండలంలో ఉన్న తాలిపేరు ప్రాజెక్టుకు వరదనీరు చేరుకుంటుంది. దీంతో తాలిపేరు ప్రాజెక్టు నుండి గేట్లు ఎత్తివేశారు. నీటిని గోదావరిలోకి వదిలారు. భద్రాచలం డివిజన్లో వేలాది ఎకరాల్లో వరద నీరు చేరుకంది.