Take a fresh look at your lifestyle.

గోదావరి వరద తగ్గుముఖం

  • పలు ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ప్రజలు
  • ఇంకా అక్కడక్కడా కురుస్తున్న వర్షాలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 18 : వారం రోజులుగా ఉధృతంగా ప్రవహించిన గోదావరి క్రమంగా తగ్గుతూ వొస్తుంది. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో నెమ్మదించింది. గోదావరితో పాటు ఉప్పొంగి ప్రవహించిన వాగులు కాస్త తగ్గుముఖం పట్టాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం(సరస్వతి) బ్యారేజీలోకి శనివారం 81,126 క్యూసెక్కుల ఇన్‌ ‌ప్లో ఉండగా ఆదివారం 6,618 క్యూసెక్కులకు పడిపోయింది. 66 గేట్లను ఎత్తి అంతే మేరకు నీటిని విడుదల చేస్తున్నారు. బ్యారేజీ నీటి మట్టం 108.40 వి•టర్లుగా ఉంది. అన్నారం బ్యారేజీ ఇన్‌ ‌ఫ్లోతో పాటు కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద ప్రాణహిత నుంచి 9,22,602 క్యూసెక్కుల ఇన్‌ ‌ఫ్లో వొచ్చి కలుస్తుండటంతో గోదావరి 11.95 వి•టర్ల ఎత్తులో ప్రవహిస్తుంది. మేడిగడ్డ బ్యారేజీకి.. ప్రాణహిత, అన్నారం బ్యారేజీ ఇన్‌ ‌ఫ్లో కలిపి 9,28,410 క్యూసెక్కులు వొస్తుంది. బ్యారేజీ 85 గేట్లను ఎత్తి అంతే నీటిని దిగువకు విడుదల చేస్తుండగా నీటి మట్టం 96.70 వి•టర్లు నమోదైంది. తుపాకులగూడెం(సమ్మక్క సాగర్‌) ‌బ్యారేజీకి 9,25,400 క్యూసెక్కుల ఇన్‌ ‌ఫ్లో వొచ్చి చేరుతుండగా 59 గేట్లను ఎత్తి మొత్తం దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజీ వద్ద నీటి మట్టం 83.05వి•టర్ల ఎత్తులో ఉంది.

ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కఘాట్‌ ‌వద్ద గోదావరి తగ్గుముఖం పట్టింది. మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం రాత్రి చిరు జల్లుల నుంచి మోస్తరు వర్షం కురిసింది. భద్రాచలం వద్ద కూడా గోదావరి క్రమంగా తగ్గుతున్నది. ఇక కరీంనగర్‌ ‌జిల్లాలో 9.7 మిల్లీవి•టర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా చొప్పదండి మండలంలో 1.84 సెంటీవి•టర్ల వర్షం కురిసింది. జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో 2.14 సెం.వి•., మల్యాలలో 1.32 సెం.వి•. జగిత్యాలలో 1.02 సెంటీవి•టర్ల వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 5.7 మి.వి•., పెద్దపల్లి జిల్లాలో 9.2 మి.వి•., మంచిర్యాల జిల్లాలో 3.8 మి.వి•. వర్షపాతం నమోదైంది. కుమరం భీమ్‌ ఆసిఫాబాద్‌ ‌జిల్లాలో ఆదివారం మోస్తరు వర్షం కురిసింది. ఎగువన వర్షాలతో ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తుంది. బెజ్జూరు మండలంలోని పరీవాహక గ్రామాలు మునిగాయి.

లింగాపూర్‌లో 2.55 సెం.వి•. వర్షం కురిసింది. శనివారం రాత్రి నుంచి ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో జల్లులు పడ్డాయి. పెనుబల్లి మండలంలో 2.04 సెం.వి•., కల్లూరులో 1.90 సెం.వి•. వర్షపాతం నమోదైంది. మిగిలిన ప్రాంతాల్లోనూ చిరుజల్లులు కురిశాయి. ఒడిసా తీర పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం ఒడిసా-పశ్చిమ బెంగాల్‌ ‌తీరంలో కొనసాగినట్టు హైదరాబాద్‌ ‌వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అల్ప పీడనం ప్రభావంతో సోమవారం ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది. ఆదివారం భదాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడేంలో అత్యధికంగా 110 మిల్లీ వి•టర్ల వర్షపాతం నమోదైంది.

Leave a Reply