Take a fresh look at your lifestyle.

గొడవకు-ముక్తా!

మొయిలు మబ్బు వట్టి
లోకం సీకటి సీర సుట్టినట్టుంది
సన్నటి సినుకుల దార
మింటికి మంటికి అంటినట్టుగా ఉంది

కర్మకొదిలే కసాయి లోకం ల
అన్నపు రాసులను ఆకలి మంటలను
అడుగడుగున అక్కుల ఆటంకాలను
దిక్కమాలిన రాజిర్కం ను
నియతి దప్పిన నియంత రివాజును

బడికోయే పొల్లగాడ్కి
బడి పలుకులు అసలద్దు
అవ్వ,అయ్య మాట్లాడే
పలుకు బడులు మాకు ముద్దు

రజాకారు రక్కసి సేస్టలను
జమిందారుల జుల్మ్ ‌ను
యెట్టి సాకిరి యెతలను
కయితలుగా మలిసిన సిపాయి

అన్నాలం నావోడు జేసిన,
నీవోడు జేసినా పొలిమెర లోపల,అవుతల
పాతరేసుడన్న నికార్సైన నాయ మూర్తి

బతుకు దేసానిది,మెతుకు పతోనిది
గతుకుల బతుకుల సంగతేందని
రాజ్జాన్ని కడిగిన సామ్యవాది

గిట్లైతదని అనుకోలేకనే
మొదట కలిసుంటే సుకమని
అటెంక యేరుపడితేనే నయమని
యేరు తెలంగాణ కొరకు పోరుబాట పట్టినోడు

బతుకంతా యేందో గొడవ
అన్నాలం మగ్గిపోతే
గొడవంత సమసి పోతే
గదే తనకి యెంతో తుర్తీ!

రాజ్జె హింస పెరిగినపుడు,
పగ దీసుట ఒప్పంటడు
పతి దానికి హిరణ కసిపుడు,
పల్లాదుడు రుజువంటడు

రాజ్జాన్ని పశినిత్తే
నక్సలైటు పేరెడతరు
అసలు సిసలు నక్సలైటు
నేనేనని ముందుంటడు

తెలంగాణ పొలములోన
పోరు యిత్తనాలు జల్లి
పంట కోయకుండానే
జల్దిన సర్గము బోయిన ప్రజాకవీ!

నీ వారస వానరులు
అవినీతికి పట్టేదార్లు
నయా నిజాము బూజు బూజు
బతికుంటే సూడలేక
సావడమే రివాజు………..
– జమ్మీ, (మీస రాజమల్లయ్య), 9491319904

Leave a Reply