Take a fresh look at your lifestyle.

గోదా… వరి

ఏ వరిది ఎవరికి ఎరుక
రగిలే మార్కెట్ల కాక!
కన్నబిడ్డల యట్లు కాపు కాసి
పురిటి నొప్పుల బాధల కొరిసి
పంటల బ్రతికించు కాపు
ఆకలి బాధలు బాపు!
ధాన్యపు రాశుల మడులు జుసి
బాధలన్నీ మరుచు!
వరుణుడు కరుణిస్తే
గోదా.. వరి సాగు!
సాగు లేక బ్రతుకు
బాట లెట్లు సాగు!
అన్నదాత యని బిరుదు
పంటకు వెల కట్టుకోలేని సాధువు!
అన్య ధరల నింగి చూపు!
అన్నదాత ధరలు అవని చూపు!
రైతు రాబడులు
నాణ్యత తక్కెడలో
బక్కచిక్కి పోతున్నవి!
అద్దాల అంగట్లో సరుకులు
ధరల పాకెట్ల మెరుపుల్లో
బరువెక్కి పోతున్నవి!
ఏ వరి ధర ఎవరికెరుక!
నిర్ణయించేది మరొకరు కనుక!

– పై.బక్కారెడ్డి
9705315250

Leave a Reply