Take a fresh look at your lifestyle.

‌గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

goal of the government,develop the villages,MPDO Srinivas
ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

గ్రామాల అభివృద్ది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని సిర్పూర్‌ ‌నియోజకవర్గ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. మండలంలోని బొంబాయి గూడ గ్రామపంచాయితీకి ఉత్తమ గ్రామపంచాయితీ పురస్కార చెక్కును మంగళవారం తన నివాసం కాగజ్‌నగర్‌లో సర్పంచ్‌ ‌కళావతికి అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ బొంబాయి గూడ గ్రామపంచాయితీ ఉత్తమ గ్రామపంచాయి తీ అవార్డుకు ఎంపిక కావడం చాలా సంతోషకరమని అన్నారు. అన్ని గ్రామ పంచాయితీలు పూర్తిస్దాయి అబివృద్ది జరిగేలా సర్పంచలు భాగస్వామ్యంతో అధికారులు కృషి చేయాలని అన్నారు. మండలానికి బొంబాయి గూడ గ్రామపంచాయితీ ఆదర్శమని గ్రామపంచాయితీ అభివృద్దికి కృషి చేసిన అధికారులను అబినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ శ్రీనివాస్‌,‌గ్రామస్దులు మల్లయ్య, సత్యనారాయణ గంగారం,అశోక్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Tags: goal of the government,develop the villages,MPDO Srinivas

Leave a Reply