Take a fresh look at your lifestyle.

‘‌సిఎఎ వ్యతిరేకులు నచ్చిన దేశం వెళ్ళిపొండి’

Get out,the country, anti-caa, opponents, mp vivek, venkata swamy
ర్యాలీలో పాల్గొన్న రఘునందన్‌ ‌రావు, వివేక్‌ ‌వెంకటస్వామి, ప్రదీప్‌ ‌రావు, ర్యాలీ అనంతరం మాట్లాడుతున్న మాజీ ఎంపి వివేక్‌ ‌వెంకటస్వామి

కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించేవాళ్ళు తమకు నచ్చిన దేశానికి వీసా తీసుకొని వెళ్ళవచ్చని తెలంగాణ బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్‌ ‌రావు అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సోమవారం సాయంత్రం పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా జాతీయవాదుల ఐక్యవేధిక ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ముఖ్య అతిథులుగా రఘునందన్‌ ‌రావు, మాజీ ఎంపి వివేక్‌ ‌వెంకటస్వామి, సీనియర్‌ ‌నాయకులు దుగ్యాల ప్రదీప్‌ ‌రావు పాల్గొన్నారు. వారు బస్టాండ్‌ ‌సమీపంలో గల అంబేద్కర్‌ ‌విగ్రహనికి పూలపూల వేసి నివాళులు అర్పించారు. అనంతరం బస్టాండ్‌ ‌నుండి అయ్యప్పదేవాలయం, అమర్‌నగర్‌, ‌శివాలయం చౌరస్తా మీదుగా జెండా వద్దకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న జాతీయవాదుల జాతీయ జెండాలు చేతిలో పట్టుకొని, మోఢీ ప్రభుత్వానికి అనుకూల నినాదాలు చేశారు. ర్యాలీ ముగిసిన అనంతరం జెండా చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రఘునందన్‌ ‌రావు మాట్లాడుతూ సిఎఎ చట్టం వల్ల దేశంలోని ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. ప్రజాస్వామ్యబద్దంగా మోఢీ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టాన్ని ఉభయ సభల్లో సుధీర్ఘంగా చర్చించి, ఆమోదం పొంది చట్టంగా రూపొందిందని ప్రజలందరు గ్రహించాలని ఆయన కోరారు. లజ్జ పుస్తక రచయిత తస్లీమా నస్రీన్‌ ‌ప్రాణ భయంతో బంగ్లాదేశ్‌ ‌విడిచి భారతదేశానికి వస్తే ఆమె ఈ దేశం ప్రజలు గుండెల్లో పెట్టుకుందన్నారు. జర్మనీలో ఉద్యోగం కొరకు వెళ్ళి, జర్మన్‌ ‌పౌరసత్వం తీసుకున్న వేములవాడ తెరాస ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు సిఎఎ ద్వారా భారత పౌరసత్వం ఇవ్వడం లేదన్నారు. మతాన్ని ప్రతిపాదికగా తీసుకొని పౌరసత్వం ఎవరికి రద్దు చేయడం లేదన్న విషయాన్ని ప్రజలందరు గ్రహించాలన్నారు. శ్రీలంక నుండి భారత దేశానికి శరణార్ధులుగా వచ్చిన 3.79లక్షల మంది తమిళులు తమకు భారత పౌరసత్వం కావాలని కోరలేదన్నారు.

భారత పౌరసత్వం కొరకు దరఖాస్తు చేసుకున్న శరణార్థులకు మాత్రం పౌరసత్వం ఇచ్చినట్లు ఆయన తెలిపారు. మయన్మార్‌ ‌నుండి ఆశ్రయం కోసం బంగ్లాదేశ్‌ ‌వెళ్ళిన రోహింగ్యాలను అక్కడి ప్రభుత్వం రోహింగ్యాల వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని బంగ్లాదేశ్‌ ‌నుండి తరిమేస్తే వారు అక్రమంగా సరిహద్దులు దాటి భారతదేశం వచ్చినట్లు తెలిపారు. ముస్లిం మతానికి చెందిన రోహింగ్యాలను బంగ్లాదేశ్‌ ‌ముస్లిం ప్రభుత్వమే తరిమేస్తే భారతదేశంలో వాళ్లను ఎందుకు ఉంచుకోవాలో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. యూనివర్శిటిల్లో చదువుకుంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న అర్భన్‌ ‌నక్సలైట్ల పని పడతామన్నారు. ఆంధోళన కార్యక్రమాల్లో పాల్గొన్న నిరసనకారుల ఆస్తులు జప్తు చేసి డబ్బు వసూలు చేయాలన్నారు. ఉత్తరప్రదేశ్‌లో యోగి ప్రభుత్వం అలాగే పని చేస్తుందన్నారు. జాతీయవాదులు కేసులకు భయపడవద్దని ఎలాంటి పోరాటానికైన వెనుకడుగువేయాద్దన్నారు. కేసులైతే వాదించడానికి తాము అండగా ఉంటామన్నారు. తాము దేశంలోని ఏ మతానికి, వర్గానికి వ్యతిరేకం కాదన్నారు. సిఎఎ చట్టాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఒకసారి చదివి తమతో చర్చలో పాల్గొనాలని ఆయన సవాల్‌ ‌విసిరారు. ఇంగ్లాండులో లా చదువుకున్న బారిస్టర్‌ ఓవైసి సిఎం కెసిఆర్‌ ‌వద్దకు వెళ్ళి ఎన్‌.‌పి.ఆర్‌. ‌సర్వే వ్యతిరేకించాలని, ఆ సర్వే తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించవద్దని కోరినట్లు ఎద్దెవా చేశారు. 2014లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సిఎం కెసిఆర్‌ ‌రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించినప్పుడు ఓవైసి ఎందుకు అడ్డుకోలేదని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, పినరయ్‌ ‌విజయ్‌ ‌తమ రాష్ట్రంలో సిఎఎ చట్టాన్ని అమలు చేయం అన్ని ప్రకటించడాన్ని రఘునందన్‌ ‌రావు తీవ్రంగా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం ఎలా అమలు చేయదో రాజ్యాంగ పరంగా, చట్టపరంగా చూస్తామన్నారు.

ఎన్‌.‌పి.ఆర్‌. ‌వల్ల ఎవరికి నష్టం లేదని ప్రతి ఒక్కరు ఎన్‌.‌పి.ఆర్‌. ‌సర్వే పాల్గొన్నాలని పూర్తి వివరాలు అందించాలని రఘునందన్‌ ‌రావు పిలుపునిచ్చా రు. అనంతరం మాట్లాడిన మాజీ ఎంపి వివేక్‌ ‌వెంకటస్వామి, దుగ్యాల ప్రదీప్‌ ‌రావులు మాట్లాడుతు సిఎఎ చట్టం వల్ల ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. భారతదేశంలో పుట్టి పెరిగిన ముస్లింలు ఎవరికి కూడా సిఎఎ చట్టం వల్ల కాని, ఎన్‌.ఆర్‌.‌సి వల్లగాని ఎలాంటి నష్టం లేదన్నారు. పతిపక్షాల చెప్పుడు మాటలు నమ్మవద్దని వారు హితవు పలికారు. సిఎఎ చట్టం రాజ్యాంగ విర్దుమనే వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. ప్రధాన మంత్రి నరేంద్రమోఢీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలు అనేకమార్లు సిఎఎ చట్టంపై భరోసా ఇచ్చిన విషయాన్ని వారు గుర్తు చేశారు. ముస్లిం మత పెద్దలు కూడా సిఎఎ చట్టానికి అనుకూలంగా చేసిన ప్రకటనలను వారు ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర నాయకులు ఠాకూర్‌ ‌రాంసింగ్‌, ‌బిజెవైఎం రాష్ట్ర కోఆర్డినేటర్‌ ఎ‌ర్రోళ్ళ శ్రీకాంత్‌, ‌బిజెపి కిసాన్‌ ‌మోర్చా రాష్ట్ర నాయకులు తంగేడ రాజేశ్వర్‌ ‌రావు, విశ్వహిందు పరిషత్‌ ‌నాయకులు రాపర్తి గోపీ, భాజపా నాయకులు అమరగాని ప్రదీప్‌ ‌రావు, శ్రీధర్‌ ‌పటేల్‌, ‌పడాల స్వామి గౌడ్‌, ‌పెద్ద సంఖ్యలో భా•పా కార్యకర్తలు, అభిమానులు, విద్యార్థులు పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగుకుండా పోలీసులు భారీ భద్రత కల్పించారు.

Tags: Get out,the country, anti-caa, opponents, mp vivek, venkata swamy

Leave A Reply

Your email address will not be published.