Take a fresh look at your lifestyle.

కొరోనా ఇకనైనా వెళ్లిపో..

కాలధర్మమే నీకు కొరోనా
మారణ హోమం చేసి మంటలు పెడుతున్నావు
కనిపించని కొరోనా దేశదేశాలు తిరుగుతూ
జ్వరము, దగ్గు చేత జగమేలుచున్నావు
శ్వాసతోనే మా ఉసురు తీస్తున్నావు.

జనుల ఆర్తనాదాలు విని ఆనందించుచున్నావు
జయించినానని విర్రవీగకుమా…
కొండెక్కి కూర్చొని కోరి గంతులేయకు
కొలిమిలో కుక్కెదరు కోవిద్‌19 ‌నిన్ను….

భువిలో ప్రజలు భీతిల్లుచుండగా
బుద్ధిగా వెళ్ళిపో భూమికి దూరంగా
నరుని మేధస్సు చేత నేలమట్టమే నీవు
కాలధర్మం తప్పదు నీకు  కడకు సుమీ

సామాజిక దూరము చేత సాగనంపుదురే
క్వారంటైన్‌ ‌చేత కొట్టి చంపుదురే
ఐసోలేషన్‌ ‌చేత అంతమొందించుదురే  నిన్ను
ఇకనైనా వినుమా జనుల మాట
నెరుపటి వారి నోట!

మాస్కు పెట్టుకున్న మనుషులను చూడు
శుభ్రమైన చేతులతో చుక్కలే నీకు …..
బంధించెదరే నిన్ను, మా ఇంట్లో మేము
బందీలమై ఉండి
నీకొక నమస్కారమే..ఇకనైనా
వెళ్ళిపో ఇలలో నుండి!

 నెరుపటి ఆనంద్‌,
ఉపాధ్యాయులు, టేకుర్తి, కరీంనగర్‌ ‌జిల్లా,
9989048428

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!